ఓ కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ జైలులో ఉంటూనే ఓ వ్యాపారిని బెదిరించాడు. తనకు రూ.5కోట్లు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగి ఫోన్ లో బెదిరించిన ఘటన వెలుగుచూసింది. తనకు రూ.5కోట్లు ఇవ్వాలని జితేంద్ర గోగి వ్యాపారిని డిమాండ్ చేశారు. 2019వ సంవత్సరంలో అరెస్టు అయిన జితేంద్ర గోగిని తీహార్ జైలుకు తరలించారు. 

జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి ఫోన్ చేసి రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకుంటే చంపేస్తానని జితేంద్ర గోగి హెచ్చరించాడు. జైలు నుంచి గ్యాంగ్ స్టర్ బెదిరించాడని అందిన సమాచారం మేర తీహార్ జైలు అదికారులు జైలు గదిలో తనిఖీలు చేయగా గోగి వద్ద 3 సెల్ ఫోన్లు లభించాయి. 

సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. గోగి తలపై హర్యానా, ఢిల్లీ పోలీసులు కలిసి రూ.6 లక్షల రివార్డు ప్రకటించారు. ఢిల్లీలోని నరేలాలో స్థానిక నాయకుడు వీరేంద్ర మన్ పై కాల్పులు జరిపి చంపాడు. వీరేంద్ర మన్ శరీరంలో 26 బుల్లెట్లు లభించాయి.