ఉత్తర్ ప్రదేశ్ లో  గ్యాంగ్ స్టర్  అనిల్ దుజానా  ఇవాళ ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. 

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో గురువారంనాడు గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానా ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. పశ్చిమ యూపీకి చెందిన కరుడు గట్టిన అనిల్ దుజానాను 2021 ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అనిల్ దుజానాపై హత్యలు, దోపీడీలు, భూకబ్జాలు వంటి కేసులు నమోదయ్యాయి. దుజానాపై 62 కేసులున్నాయి. అనిల్ దుజానాపై బులంద్ షహర్ పోలీసులు రూ. 25 వేలు, నోయిడా పోలీసులు రూ. 50 వేల రివార్డును ప్రకటించారు. 2012 నుండి అనిల్ దుజానా జైలులో ఉన్నాడు. 2021లో ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు. బెయిల్ పై విడుదలైన తర్వాత పాత కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది.