న్యూఢిల్లీ:కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను దేశంలో ఈ నెల  14వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ తో  గంగా నది శుద్ది అవుతోంది. ఈ నది నీటి నాణ్యతలో మార్పు వచ్చిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

లాక్ డౌన్ కారణంగా పలు పరిశ్రమలు కూడ మూతపడ్డాయి.దీంతో వారణాసి, హరిద్వార్ ప్రాంతాల్లో  ప్రవహించే గంగా నదిలోకి  పరిశ్రమ వ్యర్థాలు చేరడం లేదు. పరిశ్రమల వ్యర్థాలు నదిలోకి రోజు రోజుకి శుద్ది అవుతోంది. అనేక పరిశోధనల అనంతరం ప్రస్తుతం నీటి నాణ్యతలో గొప్ప మార్పు వచ్చిందని శాస్త్రవేత్తలు  అభిప్రాయపడుతున్నారు.

లాక్‌డౌన్ కారణంగా హరిద్వార్ ఘాట్లు మూసివేశారు. ప్రజలు నీటిలో దిగడం, వ్యర్థాలను నీటిలో వేయడం వంటివి లేకపోవడంతో చూసేందుకు నీళ్లు నాణ్యంగా కన్పిస్తున్నాయి.

స్థానికంగా ఉన్న పరిశ్రమలు, హోటళ్లతో పాటు ఇతరత్రా వాటి నుండి కాలుష్య వ్యర్థాలు గంగా నదిలో చేరుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ తో నది పరివాహక ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లలోనే ఉంటున్నారు. 

దీంతో గంగా నది నీరు నాణ్యత పెరిగిందని బెనారస్ హిందూ యూనివర్శిటీ ప్రోఫెసర్ డాక్టర్ పీకే మిశ్రా చెప్పారు.లాక్ డౌన్ కారణంగా ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో  కూడ కాలుష్యం కూడ గణనీయంగా తగ్గింది.