Puri Express fire accident: గాంధీధామ్‌-పూరి ఎక్స్‌ప్రెస్‌లో  అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెస్ (12993) ప్యాంట్రీ కార్ట్‌లో మంటలు చెలరేగాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికులేవ‌రికీ ప్ర‌మాదం చోటుచేసుకోలేదు. అంద‌రూ క్షేమంగా ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. 

Puri Express fire accident: గాంధీధామ్‌-పూరి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెస్ (12993) ప్యాంట్రీ కార్ట్‌లో మంటలు చెలరేగాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చాయి. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికులేవ‌రికీ ప్ర‌మాదం చోటుచేసుకోలేదు. అంద‌రూ క్షేమంగా ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. రైల్వే మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. శనివారం ఉదయం 10:30 గంటలకు మంటలు సంభవించాయి. మ‌హారాష్ట్ర‌లోని నందుర్బ‌ర్ స్టేష‌న్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సూప‌ర్‌ఫాస్ట్ రైలు (Puri Express fire accident) లోని ప్యాంట్రీ కార్ బోగీలో మంట‌లు చెల‌రేగాయి. ప్ర‌యాణికులు ఎవ్వ‌రికీ గాయాలు కాలేదు. రైలును ఆపి త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వెస్ట్ర‌న్ రైల్వే చీఫ్ ప్ర‌తినిధి సుమిత్ థాకూర్ తెలిపారు. వంట చేసే బోగీలు మంట‌ల్ని ఆర్పిన త‌ర్వాత దాన్ని రైలు నుంచి డిటాచ్ చేశారు.

"నందుర్‌బార్ స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడు గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్ (Puri Express fire accident) ప్యాంట్రీ కారులో మంటలు సంభవించినట్లు డిఎస్ఎస్/నందూర్బార్ నందుర్బార్ కంట్రోల్‌కి సమాచారం అందించారు" అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింద‌ని ANI పేర్కొంది. వైద్య బృందం, ఇతర పారామెడికల్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేదు. రైలు మొత్తం 22 కోచ్‌లను కలిగి ఉండ‌గా, ప్యాంట్రీ కారు 13వ కోచ్ లో ప్ర‌మాదం చోటుచేసుకుంది. రైలును ఆపి త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వెస్ట్ర‌న్ రైల్వే చీఫ్ ప్ర‌తినిధి సుమిత్ థాకూర్ తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన బోగీల మంట‌ల్ని ఆర్పిన త‌ర్వాత దాన్ని రైలు (Puri Express fire accident) నుంచి డిటాచ్ చేశారు.


Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…