Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు బిర్యానీ విందు ఇచ్చిన తుఫాను బాధితులు

బాధితులకు.. అధికారులు భోజనం పెట్టాల్సిందిపోయి.. వాళ్ల దగ్గర అధికారులు విందు తీసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు చదివింది నిజమే.. తుఫాను తో ఇబ్బందులు పడుతున్న తమకు సహాయం అందించారనే కారణంతో.. అధికారులకు బిర్యానీతో విందు భోజనం పెట్టారు.

gaja cyclone.. villagers offers biryani to electricity officials
Author
Hyderabad, First Published Dec 24, 2018, 11:38 AM IST


ఉద్యోగులకు.. తుఫాను బాధితులు బిర్యానీతో విందు ఏర్పాటు చేశారు. అదేంటి..? బాధితులకు.. అధికారులు భోజనం పెట్టాల్సిందిపోయి.. వాళ్ల దగ్గర అధికారులు విందు తీసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు చదివింది నిజమే.. తుఫాను తో ఇబ్బందులు పడుతున్న తమకు సహాయం అందించారనే కారణంతో.. అధికారులకు బిర్యానీతో విందు భోజనం పెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల గజ తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాను కారణంగా నాగపట్టినం జిల్లా వేదారణ్యం ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో..విద్యుత్ అధికారులు నెల రోజులపాటు కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించించారు.

దాదాపు వెయ్యిమందికి పైగా విద్యుత్‌ బోర్డు ఉద్యోగులు, కార్మికులు నెల రోజులుగా రాత్రింబవళ్లు శ్రమించి 750కిపైగా ఇళ్ళకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఈ పనులన్నీ రెండు రోజులకు ముగిశాయి. ఈ నేపథ్యంలో స్థానికులు విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులకు పెద్ద యెత్తున తమ కష్టార్జితంతో బిర్యానీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో స్థానికులతో కలిసి విద్యుత్‌ బోర్డు ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఆ తర్వాత విద్యుత్‌ బోర్డు ఉద్యోగులు, కార్మికులు స్థానికులకు ధన్యవాదాలు తెలుపుకుని తిరుచెందూరుకు పయనమయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios