Asianet News TeluguAsianet News Telugu

G20 summit 2023: రాష్ట్రపతి విందు వేళ భారత విభిన్న సంగీత వారసత్వం ప్రదర్శన..

జీ20 కూటమి నేతలు, అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఘనమైన విందు ఇచ్చారు. ఈ విందు వేళ భారతదేశం తన విభిన్న సంగీత వారసత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శించింది.

G20 Summit 2023 Showcasing musical traditions from across the country at At the gala dinner hosted by President ksm
Author
First Published Sep 10, 2023, 12:59 PM IST

జీ20 కూటమి నేతలు, అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఘనమైన విందు ఇచ్చారు. ఈ విందు వేళ భారతదేశం తన విభిన్న సంగీత వారసత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ సంగీతాన్ని ఇక్కడ ప్లే చేశారు. అందులో ‘గంధర్వ ఆటోద్యం’ కీలకంగా  ఉంది. ఇది హిందూస్థానీ, కర్నాటిక్, జానపద, సమకాలీన సంగీతాన్ని శాస్త్రీయ వాయిద్యాల సమిష్టితో ప్రదర్శిస్తూ, భారతదేశం అంతటా సంగీత వాయిద్యాల అద్భుతమైన సింఫొనీని కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన సంగీత మేళవింపు. 

G20 Summit 2023 Showcasing musical traditions from across the country at At the gala dinner hosted by President ksm

ప్లేజాబితాలో ఉన్నవి ఇవే..
హిందుస్తానీ సంగీతం: రాగ్ దర్బారీ కందా, కాఫీ-ఖేలత్ హోరీ
జానపద సంగీతం : రాజస్థాన్- కేసరియ బలం, ఘుమర్, నింబుర నింబుర
కర్ణాటక సంగీతం : రాగ్ మోహనం - స్వాగతం కృష్ణ
జానపద సంగీతం : కాశ్మీర్, సిక్కిం, మేఘాలయ - బొమ్రు బొమ్రు
హిందుస్తానీ సంగీతం: రాగ్ దేశ్, ఎక్లా చలో రే
జానపద సంగీతం : మహారాష్ట్ర - ఆబిర్ గులాల్ (అభంగ్), రేష్మా చారే ఘని (లవని), గజార్ (వర్కారి)
కర్ణాటక సంగీతం : రాగ్ మధ్యమావతి - లక్ష్మీ బారమ్మ
జానపద సంగీతం : గుజరాత్- మోర్బానీ, రామ్‌దేవ్ పీర్ హెలో
సాంప్రదాయ, భక్తి సంగీతం : పశ్చిమ బెంగాల్ - భటియాలి, అచ్యుతం కేశవం (భజన్)
జానపద సంగీతం : కర్ణాటక - మదు మేకమ్ కన్నై, కావేరి చిందు, ఆడ్ పాంబే
భక్తి సంగీతం : శ్రీ రామ్ చంద్ర కృపాలు, వైష్ణవ్ జన తో, రఘుపతి రాఘవ
హిందుస్తానీ, కర్నాటిక్, జానపద సంగీతం: రాగ్ భైరవి- దాద్రా, మిలే సుర్ మేరా తుమ్హరా

G20 Summit 2023 Showcasing musical traditions from across the country at At the gala dinner hosted by President ksm

ఈ సంగీత ఏర్పాట్లు భారతదేశ అసమానమైన ,ప్రత్యేకమైన సంగీత వారసత్వాన్ని ప్రదర్శించే వివిధ అరుదైన వాయిద్యాల వినియోగాన్ని కలిగి ఉన్నాయి. ఈ వాయిద్యాలలో సుర్సింగార్, మోహన్ వీణ, జలతరంగ్, జోడియా పావా, ధంగలి, దిల్రుబా, సారంగి, కమైచా, మట్టా కోకిల వీణ, నల్తరంగ్, తుంగ్‌బుక్, పఖావాజ్, రబాబ్, రావన్‌హట్టా, థాల్ దానా, రుద్ర వీణ మొదలైనవి ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios