కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ సారి బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. వీటితోపాటు మధ్యతరగి ప్రజలు ఆశించిన మార్పులను పెద్దగా బడ్జెట్‌లో కనిపించలేవు. దీనితో మిడిల్ క్లాస్ కష్టాలను హాస్యాన్ని జోడించి మీమ్‌లు సోషల్ మీడియాలో పోటెత్తాయి. 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టగానే సోషల్ మీడియాలో మీమ్‌లు పోటెత్తాయి. కామెడీ మీమ్‌లు వరదలా వచ్చిపడ్డాయి. ఇంటర్నెట్ మొత్తం వీటితో కిద్దిసేపు నిండిపోయింది. బడ్జెట్ ప్రవేశపెట్టగానే ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో బడ్జెట్ 2020, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. అయితే, ఈ ట్యాగ్స్ సహా మరికొన్నింటిలో మిడిల్ క్లాస్ మీమ్స్ సంచలనం చేశాయి. ట్రెండ్స్ లిస్ట్‌లో ఈ మీమ్‌లే టాప్‌కు వెళ్లాయి. ఇవన్నీ మధ్యతరగతి జీవుల సేవింగ్స్ కోసం ఎదురుచూపును తలపించేలా, ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులను ఆశిస్తూ చేసినవే ఎక్కువ మీమ్స్ ఉన్నాయి.

కానీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ్ మాత్రం ఇన్‌కమ్ ట్యాక్స్ పర్సనల్ క్యాటగిరీలో ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. ప్రస్తుత ఆదాయ పన్ను విధానంలో మార్పులను ఆశించారు. కానీ, అందులో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ కనిపించలేదు. సేవింగ్స్ గురించి ఆదాయ పన్ను గురించి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న మిడిల్ క్లాసు మీమ్‌లు చాలా కామెడీగా ఉన్నాయి. వాటిని ఓ సారి చూద్దాం.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

ఇదిలా ఉండగా, నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారుల కోసం ఓ ప్రకటన చేశారు. రెండేళ్లలోగా వారు ఐటీ రిటర్నులు దాఖలు చేయవచ్చని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ట్యాక్స్ డిడక్షన్ లిమిట్‌ను పది శాతం నుంచి 14 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రత ప్రయోజనాలు పెరుగుతాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్లు దాదాపు సమానం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు.