ఫుల్‌గా మద్యం తాగిన ఓ ఢిల్లీ మోడల్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నానా రచ్చ చేసింది. నిషాలో ఆర్మీ వాహనాన్ని అడ్డుకుని దానిపై ఒరిగి కేకలు వేశారు. ఆ వెహికల్ బంపర్‌ను తన్నారు. జోక్యం చేసుకోబోయిన ఆర్మీ జవాన్‌ పైపైకి ఆమె వెళ్లారు. అనంతరం ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన గ్వాలియర్‌లో రద్దీగానున్న దారిపై ఆర్మీ వెహికల్‌ను అడ్డుకుని ఓ మోడల్ నానా రచ్చ చేసింది. పూటుగా మద్యం తాగి ఆర్మీ వాహనాన్ని ఆపి దాని బంపర్‌ను తన్నారు. నిషాతో తూలుతున్న ఆమె వాహనానికి దారి ఇవ్వకుండా దానిపైనే ఒరిగి కాసేపు నిలిచారు. బండిని ముందుకు తీసుకెళ్లలేక ఆర్మీ వెహికల్ డ్రైవర్ దిగి ఆమెను పక్కకు తప్పించబోయాడు. కానీ, ఆమె జవాన్‌పైపైకి వెళ్లింది. ఆయనను తోసేస్తూ కొంచెం పక్కకు జరిగింది. ఇదే అదనుగా ఆయన వెహికల్‌ను ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Scroll to load tweet…

ఢిల్లీకి చెందిన మోడల్ ఇద్దరు మిత్రులతో మధ్యప్రదేశ్ వచ్చింది. గ్వాలియర్‌లో ఫుల్‌గా తాగేసి నిషాలో ఇష్టారీతన వ్యవహరించింది. పబ్లిక్ ప్లేస్‌లో రచ్చ చేసింది. అంతేనా, ఓ ఆర్మీ వెహికల్‌ను అడ్డుకుంది. దానిపై ఒరిగి కేకలు పెట్టింది. కారు బంపర్‌ను తన్నారు. బంపర్ తన్నుతుండగా ఆమె పర్సులో నుంచి లిక్కర్ రోడ్‌పై పడింది. కారు బంపర్‌ను తన్నగానే ఆర్మీ వెహికల్ డ్రైవర్ దిగి ఆమెను పక్కకు తప్పించబోయారు. కానీ, ఆమె ఆయనపైపైకి వెళ్లి నెట్టేసింది. ఇంతలో వీడియో తీస్తున్న వ్యక్తివైపు చూస్తూ నిలబడింది. కొంచెం పక్కకు తప్పుకోగానే వెహికల్ వెళ్లిపోయింది.

అనంతరం ఆ మోడల్‌ను స్థానిక మహిళా పోలీసు కానిస్టేబుల్ సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఆమెపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఆమెపై ఆర్మీ నుంచి ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఓ అధికారి వివరించారు.