కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ను ప్రభుత్వం ఎత్తేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో నేటినుంచి యధావిధిగా ఆఫీసులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ తో థార్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో జనవరిలో వర్క్ ఫ్రం హోంకు అనుమతించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ : omicron ఎంట్రీతో భారత్ లో covid 19 థార్డ్ వేవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఓ స్థాయిలో రోజువారీ కేసులు మూడు లక్షలు కూడా దాటాయి. దీంతో, ప్రభుత్వం, ప్రవైట్ సంస్థలు కూడా ఉద్యోగులకు work from home సౌకర్యం కల్పించాయి. ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు లక్షకు చేరువకు వచ్చాయి. ఈ నేపథ్యంలో central govt కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆఫ్షన్ ను ఎత్తి వేసింది. ఇవాళ్లి నుంచి ఉద్యోగులందరూ యథావిధిగా ఆఫీసులకు రావాల్సిందేనని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కాగా, జనవరిలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో 50 శాతం సిబ్బంది మాత్రమే ఆఫీసులకు రావాలని ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఫిబ్రవరి 15వ తేదీవరకు ఈ విధానం అమల్లో ఉంటుందని పేర్కొంది.
కానీ, దేశవ్యాప్తంగా క్రమంగా కోవిడ్ కేసులు తగ్గడం, పాజిటివిటీ రేటు కూడా తగ్గిపోతున్న తరుణంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచే.. అంటే ఇవ్వాల్టి నుంచే ప్రభుత్వ కార్యాలయాలను పూర్తి స్థాయిలో పని చేయించాలని కేంద్రం నిర్ణయించింది. అన్నిస్తాయిల్లోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఉద్యోగులందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.
ఇదిలా ఉండగా, ఒమిక్రాన్ విజృంభణ కారణంగా దేశంలో corona cases పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా కేంద్ర Government officesల్లోని సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే సిబ్బంది లో 50 శాతం మందికి work from homeకు అనుమతిస్తూ కేంద్రం జనవరి 4న ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అన్ని all Ministries to departmentsకు తక్షణం వర్తించే ఈ ఆదేశాలు జనవరి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ముందుగా తెలిపింది.
వాస్తవ సిబ్బంది సంఖ్యలో 50 శాతం మంది మాత్రమే ఆఫీసు విధులకు హాజరు కావాలని, మిగతా సగం మందికి వర్క్ ఫ్రం హోం అమలుచేయాలని వివరించింది. దివ్యాంగులు, గర్భిణీలకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా, కంటెయిన్ మెంట్ జోన్ లలో నివాసం ఉండే వారికి కూడా ఆయా జోన్లను డీనోటిఫై చేసేవరకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.
ఉద్యోగులంతా ఒకే సమయంలో కార్యాలయాలకు రాకుండా అమలు వేర్వేరు పనివేళలను అమలు చేయాలని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది అందరూ హాజరు పట్టికలో సంతకాలు చేసి తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
