కరోనాను అరికట్టడంలో కేంద్రం ఘోరంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ మాజీ  చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు సంపూర్ణ లాక్‌డౌన్ పరిష్కారం సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు

న్యూఢిల్లీ: కరోనాను అరికట్టడంలో కేంద్రం ఘోరంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు సంపూర్ణ లాక్‌డౌన్ పరిష్కారం సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే వందలాది మంది కరోనా రోగులు మృత్యువాతపడుతున్నారని ఆయన ఆరోపించారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

కేంద్రం నిర్లక్ష్యధోరణితో వందలాది మంది అమాయకులు మృతి చెందుతున్నారని ఆయన ట్విట్టర్ లో ఆరోపించారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్రం వైఫల్యం చెందిందని కొంతకాలంగా రాహుల్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో అనేక మంది మృత్యువాతపడుతున్నారు. 

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటుంది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని కేంద్రం ఆయా రాష్రాలను కోరింది. అయితే రాష్ట్రాల డిమాండ్ మేరకు వ్యాక్సిన్లు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం ఫార్మా కంపెనీల వైపు చూస్తున్నాయి.