Mamata Banerjee: దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రాలు జీతాలు చెల్లించగలవో? లేదో ? అనే అనుమానం వ‌స్తోంద‌ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పెట్రోల్, డిజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్రం ఏమీ చేయడం లేదని, ఆ ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాలని కేంద్రానికి డిమాండ్‌ చేశారు.   

Mamata Banerjee: ప్రభుత్వ దుకాణాల నుంచి విక్రయించే కొన్ని రకాల పండ్లు, కూరగాయల ధరలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తగ్గించారు. అదే సమయంలో ఇంధన ధరలను తగ్గించాలని, టోల్ పన్నును తాత్కాలికంగా మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. ధరల పెరుగుదలను నియంత్రించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పెట్రోలు, డీజిల్‌, ఎల్‌పీజీ ధరలను తగ్గించేందుకు, ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. 

ఇటీవల పెరిగిన ఇంధన ధరలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెట్రోలు, డీజిల్‌, ఎల్‌పీజీ ధరలను తగ్గించేందుకు, ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో దేశంలో పెరిగిన ఇంధన ధరలకు.. శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో పోల్చారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. గత 17 రోజులుగా ఇంధన ధరలు లీటరుకు రూ.10 చొప్పున పెరిగాయని అన్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఆమె తెలిపారు.

నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత.. మోడీ స‌ర్కార్ దేశానికి రిటర్న్ గిప్ట్ ( Centre's return gift) లా ఇంధన ధరల పెంపు చేశార‌ని ఏద్దేవా చేశారు.బ‌ ధరల పెంపును ఆపడానికి కేంద్రం ఏమీ చేయడం లేదని, ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను ఉపయోగించకుండా.. మార్కెట్‌లో అక్రమ నిల్వల కోసం వెతకడానికి కేంద్రం సమయం కేటాయించాలని ఆమె అన్నారు.

నిత్యావ‌స‌ర వస్తువుల ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి.. ప్రభుత్వ దుకాణాల నుంచి విక్రయించే కొన్ని రకాల పండ్లు, కూరగాయల ధరలను మమతా బెనర్జీ తగ్గించారు. 'సుఫల్ బంగ్లా' రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా పండ్లు మరియు కూరగాయలను సబ్సిడీ ధరలకు విక్రయిస్తుందని ప్రకటించింది. ఇందులో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, ఇతర కూరగాయలు విక్రయించ‌నున్నారు. ముస్లీంల రంజాన్ పండుగ ను దృష్టిలో పెట్టుకుని.. వారి కోసం, సుఫాల్ బంగ్లా ద్వారా ఖర్జూరం,అరటిపండ్లను సబ్సిడీ రేటుకు విక్రయించ‌నున్నారు. ఈ స‌మయంలో శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని(economic crisis) సీఎం మమతా బెనర్జీ ప్రస్తావిస్తూ.. అక్క‌డ‌ ‘ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందనీ, శ్రీలంకలో వ‌స్తువుల ధ‌ర‌లు మండిపోతున్నాయ‌ని తెలిపారు.

అలాగే భారత్‌లో కూడా ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తులో రాష్ట్రాలు జీతాలు చెల్లించగలవో? లేదో ? అని తనకు అనుమానంగా ఉందన్నారు. మరో ఐదేండ్ల పాటు GST కాలపరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాలకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే.. వ్యవసాయ ఆధారిత‌ వాహనాలకు టోల్ పన్ను( Toll Tax)ను తీసుకోవడం మానేయాలని సూచించారు. ఇది వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతోందని కేంద్ర‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే.. మందుల ధరల పెంపుపై దృష్టి సారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నిత్యం బ్లాక్‌మార్కెటింగ్‌ను పరిశీలించాలని ఆ రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖను ఆదేశించారు.