Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్: టాబ్లెట్‌లో రాహుల్ బిజీ, రెండు నినాదాలు.. బడ్జెట్ వేళ హౌస్‌లో విశేషాలు..

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ 2023-24 ప్రవేశ పెట్టిన సందర్భంగా హౌస్‌లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను తాజా ఎపిసోడ్‌లో తెలుసుకుందాం..  
 

From the India gate special on union budget from Rahul tablet to two slogans
Author
First Published Feb 1, 2023, 9:04 PM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ 2023-24 ప్రవేశ పెట్టిన సందర్భంగా హౌస్‌లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను తాజా ఎపిసోడ్‌లో తెలుసుకుందాం..  

భవిష్యత్తు కోసం టాబ్లెట్..
భారతదేశంలో డిజిటలైజేషన్ నిజంగానే ఊపందుకుంది. ఫిజికల్ ఫైల్స్‌లో ముద్రించిన పేజీల నుంచి ఆర్థిక మంత్రులు మాట్లాడే రోజులు పోయాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఇండియాకు మస్కట్‌గా తనను తాను ప్రదర్శించుకునేలా టాబ్లెట్‌లో బడ్జెట్‌ను చదివారు. 

పార్లమెంట్‌లో టాబ్లెట్‌‌లో పూర్తిగా నిమగ్నమైన మరొక వ్యక్తి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన బడ్జెట్‌ను చదవలేదు.. కానీ కొన్ని భారీ టెక్స్ట్ ఫైల్స్‌ను స్క్రోలింగ్ చేశారు. తన స్మార్ట్ ఫోన్‌ను ఎక్కువగా వినియోగించలేదు. అతని స్మార్ట్ ఫోన్ టేబుల్‌పైనే పడి ఉంది.. ఎక్కువ సమయం దానిని వినియోగించలేదని గ్యాలరీ నుంచి క్లియర్‌గా కనిపించింది. ఇక, సభలో స్మార్ట్ ఫోన్ మరెక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఆర్థిక మంత్రి ఆమె ప్రసంగాన్ని చదివేటప్పుడు కూడా పలువురు ఎంపీలు తమ స్మార్ట్ ఫోన్ స్క్రీన్స్ చూస్తూ బిజీగా కనిపించారు.

చికాకు కలిగించే విధంగా..
సందర్శకుల గ్యాలరీలో కొంతమంది ధైర్యవంతులు లేదా తెలివైనవారు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారు తమ ఫోన్లను వినియోగించినట్టుగా తెలుస్తోంది. ఇన్‌కమింగ్ మెసేజ్ టోన్‌లు క్రమం తప్పకుండా వినబడుతూనే ఉన్నాయి. అలాగే ఫోన్‌లు కొన్ని సార్లు మోగుతున్నాయి. అయితే ఈ శబ్దాలను మార్షల్స్ విని ఉంటే లేదా ఫోన్ వాడటాన్ని చూసినట్లయితే వారికి ఏమి జరిగి ఉండేదో ఆశ్చర్యపోయేవారు. మేము వారిని వర్ణించడానికి ధైర్యవంతులు అనే పదాన్ని ఉపయోగించాము.. ఎందుకంటే వారిలో ఒకరు అక్కడ ఫోన్‌లో మాట్లాడటం కూడా కనిపించింది. ఎంపీలు, మంత్రులు కూడా ఈ సాహసం చేయరు. 

సరైన సమయంలో.. 
బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాకముందే ట్రెజరీ బెంచ్‌లు దాదాపుగా నిండిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు కూడా లోపలికి చేరుకున్నారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ఉదయం 10.57 గంటలకు లోపలికి వచ్చే సమయానికే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఇతర అధికార పార్టీ పెద్దలు హౌస్‌లో కూర్చున్నారు. 

ఇదిలా ఉంటే.. సెషన్ ప్రారంభానికి ఒక నిమిషం ముందు ఉదయం 10.59 గంటలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హౌస్‌ లోపలికి వెళ్లి ముందు వరుసలో ఫరూక్ అబ్దుల్లా పక్కన కూర్చున్నారు.

ఒకరికి ఆదరణ, మరొకరిని గుర్తింకచకపోవడం.. 
ఆ తర్వాత కాసేపటికి మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఒక్కొక్కరిగా హౌస్‌లోకి వచ్చారు. ఇద్దరి ఎంట్రీలు విరుద్ధమైన శైలిలో ఉన్నాయి. శశి థరూర్ లోపలికి వచ్చిన సయమంలో.. అక్కడ కనిపించిన దృశ్యాలను చూస్తే అతను ఆదరణ పొందిన ఎంపీ అనేలా ఉన్నాయి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే.. మరో ఎంపీ శత్రుఘ్న సిన్హా చాలా ఆలస్యంగా ఉదయం 11.53 గంటలకు అక్కడికి వచ్చారు. అయితే అప్పుడు ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తనని ఎవరైనా గుర్తిస్తారా? అన్నట్టుగా చుట్టూ చూస్తూ నిలబడ్డారు. అయితే ఎవరి నుంచి పెద్దగా స్పందన రాలేదు. అప్పుడు అతను కూర్చుని మళ్ళీ చుట్టూ చూశారు.. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

అలా పట్టుబడిన థరూర్.. 
శశిథరూర్ ప్రపంచానికి తెలియకూడదనే పనిచేసి పట్టుబడ్డారు. హౌస్‌తో తాను తిన్న పదార్థంను కవర్ చేసే రేపర్‌ను తీసుకుని..  తన ప్రక్కన సీటులో (ఖాళీగా ఉంది) మ్యాగజైన్ జేబులో (విమానంలో సీటు వెనక భాగంలో ఉన్న విధంగా) సౌకర్యవంతంగా పారవేశారు. బహుశా ఆయన చేసినది నేరుగా పై భాగంలో గ్యాలరీలలో కూర్చుని ఉన్న పాత్రికేయులకు కనిపిస్తుందని గ్రహించలేదు.

మోదీ-మోదీ వర్సెస్ భారత్ జోడో
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సమయంలో కేంద్ర ప్రభుత్వం లేదా దేశం సాధించిన పెద్ద విజయాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ట్రెజరీ బెంచ్‌లు మోడీ-మోదీ అని ఇప్పటికే సుపరిచితమైన నినాదాన్ని ఆశ్రయించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం.. వెంటనే భారత్ జోడో అని నినాదాలు చేయడం కనిపించింది. మిగిలిన ప్రతిపక్షాలు కూడా వారితో జతకలుస్తాయని వారు ఆశించి ఉంటే.. మిగిలిన వారు చూసి నవ్వడం వల్ల అది జరగలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios