దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెర వెనుక జరిగే పరిణామాలను, గుసగుసలను పాఠకుల ముందు ఉంచుతున్నది. తాజా ఎపిసోడ్‌లోని కబుర్లు ఇవే..
దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెర వెనుక జరిగే పరిణామాలను, గుసగుసలను పాఠకుల ముందు ఉంచుతున్నది. తాజా ఎపిసోడ్‌లోని కబుర్లు ఇవే..
కారుకూతల 'నేతా'జీ
ఆయన ట్వీట్ పడిందంటే సమాజ్‌వాదీ పార్టీ నేతలకు చలి వణుకు పుడుతుంది. బ్రాహ్మిణ్, పండితులపై ఆయన విద్వేషం చల్లి జైలుకు వెళ్లడంతో కొంత ఊపిరి తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ఎస్పీ నాయకత్వం మళ్లీ హైరానాలో పడింది. ఎందుకంటే ఒకే రోజులో అతను జైలు నుంచి బయటకు వచ్చాడు.
ఇక భరించేది లేదని పార్టీ మీడియా సెల్ నుంచి తొలగించి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విషం చిమ్మకుండా ఎస్పీ చర్యలు తీసుకుంది. కానీ, ఆ నేతాజీ తన వ్యక్తిగత హ్యాండిల్స్‌తో అగ్రకులాలపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ నేత రెక్కలను ముడేసే సమయం వచ్చిందని విమర్శకులు భావిస్తున్నారు.
కాషాయ కవచం
రాజకీయ శ్రేణులను ఆకట్టుకోవడానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వేసిన జిమ్మిక్‌కు బెహంజీ నుంచి వచ్చిన ఊహించని గూగ్లీ ఔట్ చేసింది.
‘నేను శూద్రుడిని’ అంటూ అఖిలేశ్ యాదవ్ ఇటీవలే ఓ పోస్టర్ లాంచ్ చేశాడు. రామచరితమానస్ పై పేలుతున్న వాదనలకు కొనసాగింపుగా ఈ స్టంట్ వేశాడు. కానీ, ఆయన ఎక్కువ కాలం పోస్టర్ బాయ్ కాలేకపోయాడు.
బాబా సాహెబ్, రాజ్యాంగంతో బెహెంజీ ఆయనకు కౌంటర్ ఇచ్చింది. చాతుర్వర్ణ రోజులు ముగిశాయని ఆమె అఖిలేశ్‌కు గుర్తు చేసింది. రాజ్యాంగం దానికి నేటి కాలపు విభజనను సూచించిందని పేర్కొంది.
క్లీన్ బౌల్డ్ అయిన అఖిలేశ్ యాదవ్ ఎప్పటికీ అందుబాటులో ఉండే కాషాయ తెర వెనుక నక్కాడు. ఆమె బీజేపీ లవర్ అని పేర్కొని డిఫెన్స్‌లోకి వెళ్లాడు. ఈ వ్యాఖ్యలను నిజానికి బీజేపీ కూడా ఇష్టపడకపోవచ్చు.
అడవి రాజు
ఆయన తండ్రి గర్జిస్తే భరత్‌పుర్ మాత్రమే కాదు సీఎం కార్యాలయం కూడా గజ్జుమంటుంది. కానీ, ఆ రాజస్తాన్ మంత్రి కొడుకు మాత్రం తండ్రిని రాజకీయ అడవికి రాజు అని అంగీకరించడు.
కొడుకు, అతని భార్య ఇద్దరూ మరో యువ నేత వెంట ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ యువనేత ద్వారా పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. సీఎం గెహ్లాట్ క్యాబినెట్‌లో తండ్రి సభ్యుడైనప్పటికీ అది తన కొడుకును గుజ్జర్ నేతతో చేతులు కలుపకుండా నిలువరించలేకపోయింది.
ఈ ఘర్షణలో చివరి అంకం.. ఆయన విసిరిన ట్వీట్. అందులో మంత్రి కొడుకు ఇలా రాసుకున్నాడు. అడవిలో ఒకే సింహం ఉన్నది. అదెవరో అందరికీ తెలుసు అని ట్వీట్ చేశాడు. అతని తండ్రికి, సీఎంకు పడని వ్యక్తినే నేరుగా అడవి రాజు అని పేర్కొన్నాడు.
మంత్రి అయిన తండ్రికి భిన్నమైన దారిలో వెళ్లుతున్న కొడుకు గురించి కాంగ్రెస్ కార్యకర్తలు.. దీపం కిందనే చీకటి ఉంటుంది అనే మాటను ప్రస్తావిస్తున్నారు.
దారితప్పిన పర్యటన
రాజస్తాన్‌లో శక్తిమంతమైన మహిళఆ మేయర్ బెంగళూరు, ఊటీలకు టూర్ ప్లాన్ చేసింది. కానీ, కౌన్సిలర్లు వెనుకడుగేయడంతో చివరి నిమిషంలో పర్యటన మొదలవ్వకుండానే ముగిసిపోయింది.
ఇద్దరు మంత్రులతో ఈ కాంగ్రెస్ మేయర్‌కు మంచి సంబంధాలున్నాయని అందరికీ తెలుసు. కానీ, ఆమె వైఖరి, అహంభావం కారణంగా సొంత పార్టీ కౌన్సిలర్లే ఝలక్ ఇచ్చారు.
100 వార్డులు ఉన్న ఆ కార్పొరేషన్ రాజస్తాన్‌లోని పెద్ద పాలక మండలి. ఆ మేయర్ ప్లాన్‌ను పార్టీ కౌన్సిలర్లే స్వీకరించకపోవడంతో ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని ఆమె అనుమానించింది.
బెంగళూరు, ఊటీలకు వెళ్లడానికి అన్ని సౌకర్యాలతో కౌన్సిలర్లకు టూర్ ప్లాన్ చేసింది. కానీ, ఏకంగా సీఎం అశోక్ గెహ్లాటే కలుగజేసుకోవడంతో టూర్ అటకెక్కింది.
ఈ టూర్ ప్లాన్ గురించి కౌన్సిలర్లలో ఒకరు ప్రతిపక్షానికి లీక్ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో సీఎం ఆగ్రహం చవిచూడాల్సి వచ్చింది.
బహు భాషా
ఉత్తరాది రాజకీయ నేతలకు భాషా రాజకీయం కొత్తేమీ కాదు. ముఖ్యంగా దక్షిణాది వైపు వచ్చినప్పుడు స్థానిక భాషలో వారిని పలకరించి వెంటనే కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా చోట్ల ముఖ్యంగా ఎన్నికల క్యాంపెయిన్‌లో చూస్తాం.
కానీ, ఢిల్లీలో ఇటీవలే ఇందుకు భిన్నమైన కేసు ఒకటి కనిపించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు నమస్కారా అని సమావేశాన్ని ప్రారంభించారు. అంతేకాదు, మరో అడుగు వేసి చెన్నగిడ్డీరా (అందరూ బాగున్నారని తలుస్తున్నా) అని కూడా అనేశారు. అక్కడ గుమిగూడిన మీడియా ప్రతినిధులు ఈ కన్నడ గ్రీటింగ్స్‌తో అవాక్కయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖ కేటాయింపుల గురించి మాట్లాడటానికి పెట్టిన ప్రస్ మీట్‌లో ఈ పలుకుతో ఆశ్చర్యపోయారు.
దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ విధింపు ప్రయత్నాలు బీజేపీకి వ్యతిరేకతను తెస్తున్నాయి. దీన్ని తొలగించడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ పలకరింపు అని వారు చర్చించుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. తమిళనాడు తరహాలోనే కర్ణాటకలోనూ జాతీయ నేతలు హిందీ ప్రయోజనాల గురించి చెప్పే వచనాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
మొత్తానికి జాతీయ నేతలు ఇప్పుడు ఢిల్లీ దర్బార్‌లో కన్నడ భాషపై ప్రేమ కురిపించడం హర్షణీయమే. త్వరలోనే తమిళ వణక్కమ్ కూడా వినిపిస్తుందేమో అని ఢిల్లీ మీడియా గుసగుసలు పెట్టుకుంటున్నది.
రిసార్ట్ రాజకీయం
తమ నేతలను వేరే పార్టీల నుంచి కాపాడుకోవడానికి పార్టీలు తరుచూ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపడం సాధారణ విషయమే. కానీ, కేరళలో సీపీఎం ఇందుకు పూర్తిగా భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నది. అదీ టూరిస్టు రిసార్ట్ చుట్టే సమస్యను ఫేస్ చేయాల్సి వస్తున్నది.
సీపీఎం యువ నేత చింతా జెరోమ్, వారి కుటుంబం ఓ టూరిస్టు రిసార్ట్‌లో కొన్నేళ్ల తరబడి ఉంటున్నారనే విషయం బట్టబయలైన తర్వాత సీపీఎంపై విమర్శలు మొదలయ్యాయి. చింతా జెరోమ్.. పార్టీ స్టేట్ కమిటీలో యువ సభ్యులు, స్టేట్ యూత్ కమిషన్ చైర్‌పర్సన్.
ఆమె తన పీహెచ్‌డీ థీసిస్‌లో అవమానకర రీతిలో చేసిన పొరపాటుతో వార్తల్లోకి వచ్చారు. కేరళ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుండగా ఆమె భారీ వేతనాలు, అరియర్స్ అడగడంతో హెడ్‌లైన్స్‌లోకి ఎక్కారు. ఆమె తన ఫ్రెండ్ రిసార్ట్‌లో ఉచితంగా ఉంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. కానీ, ఆమె వాటన్నింటినీ కాదన్నది. తాను నెలకు రూ. 20 వేల రెంట్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఆమె ఇచ్చిన ఈ వివరణతో టూరిస్టులు అంత చీప్‌గా ధరలు ఉన్న రిసార్ట్‌కు బారులు తీరుతారేమో!
ఈ రిసార్ట్ రాజకీయం అంతటితో ముగిసిపోలేదు. కన్నూర్ స్ట్రాంగ్‌మెన్ ఈపీ జయరాజన్, పీ జయరాజన్‌ల వాగ్యుద్ధానికి తెరపడటం లేదు. పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేసినా విఫలం అయ్యాయి.
తర్వాతి రోజే రాష్ట్ర కమిటీ పీ జయరాజన్ మరో సారి ఈపీపై ఆరోపణలు గుప్పించారు. ఈపీ కన్నూర్‌లోని లగ్జరీ ఆయుర్వేద రిసార్ట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాడని, దానిపై స్వార్థ ప్రయోజనాల ఆలోచనలు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై సీపీఎం పార్టీ ఓ దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసినట్టు వదంతులు వచ్చాయి. కానీ, పార్టీ జనరల్ సెక్రెటరీ ఎంవీ గోవిందన్ ఈ ఆరోపణలు ఖండించారు. ఇవన్నీ మీడియా చిత్రీకరణలే అని కొట్టిపారేశారు.
