Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్: కర్ణాటకలో మ్యూట్ బటన్, దీదీ కళ, బీజేపీ నేత రాంగ్ పార్కింగ్..

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి 12వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

From The India Gate Pilotless drift BJP leader wrong parking and more
Author
First Published Feb 6, 2023, 10:00 AM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 12వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మ్యూట్ బటన్..
బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ మాట్లాడకుండా చేసింది ఎవరు?. సాధారణంగా యత్నాల్ ప్రతిపక్షాలతో పాటు తన పార్టీ సహచరులు బీఎస్ యడియూరప్ప, మంత్రి మురుగేష్ నిరాని వంటి సీనియర్లపై  కూడా విమర్శల దాడి చేసేవారు. అయితే తాజాగా ఢిల్లీలో రహస్య పర్యటన అనంతరం యత్నాల్ సైలెంట్ మోడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్వర తంతువులను ఢిల్లీ చలి స్తంభింపజేసిందని ప్రజలు మొదట్లో భావించారు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన బలమైన హెచ్చరికతో మ్యూట్ బటన్ యాక్టివేట్ అయినట్లు తెలిసింది.

నిశ్శబ్దంగా ఉండమని షా ఇచ్చిన సలహాతో ఫైర్ బ్రాండ్ నాయకుడైన యత్నాల్ తన భావోద్వేగ ప్రకోపాలను తగ్గించేలా చేసింది. అయితే యత్నాల్ మ్యూట్ మోడ్‌లో వెళ్లడానికి.. పంచమసాలి రిజర్వేషన్‌ సమస్య పరిష్కారానికి క్విడ్‌ ప్రోకోగా ఇచ్చిన హామీ కారణమని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం గట్టిగా సమర్థించిన వారిలో యత్నాల్ ఒకరు.

అయితే ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా చాలా తక్కువ మంది స్నేహితులున్న యత్నాల్‌కు ‘‘షా-కాజ్’’ నోటీసు అక్షరాలా రెండో ఎల్లో కార్డు అని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో అతనికి ఓదార్పుగా ప్రముఖ నేత అనంత్ కుమార్ ఉండేవారు. ఇక, యత్నాల్ అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో సభ్యుడిగా ఉన్నప్పుడు.. సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ కూడా చాలాసార్లు రిఫరీగా వ్యవహరించాల్సి వచ్చింది. 

వారసులు..
కేంద్రంపై దాడికి దిగినప్పుడల్లా ఆమె మనసు భయపడకుండా ఉంటుంది. ఆమె ఎవరో కాదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సాధ్యమైన ప్రతి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వంపై, దాని విధానాలపై విమర్శలు చేసేందుకు అనుకూలంగా మార్చుకుంటారు. తాజాగా ఆమె కేంద్ర ప్రభుత్వంపై త్వరితగతిన దాడి చేసేందుకు ఒక ప్రముఖ వ్యక్తిని ఉపయోగించింది. ఆయన ఎవరంటే.. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్. 

రవీంద్ర నాథ్ ఠాగూర్ స్థాపించిన బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బోల్పూర్-శాంతినికేతన్‌లోని ఐకానిక్ విశ్వభారతి విశ్వవిద్యాలయం ఆవరణలోని భూమిని ఖాళీ చేయమని సేన్‌కు (ఇతర మాజీ ఆశ్రమవాసుల విషయంలో) నోటీసు అందింది. ఇలా ఖాళీ చేయమని కోరిన అనేక మంది ప్రముఖులలో ఆయన కూడా ఒకరు. వీరంతా యూనివర్శిటీ మాజీ అధ్యాపకుల వారసులుగా ప్లాట్‌ను వారసత్వంగా పొందారు. అమర్త్య సేన్ తల్లి అమృతా సేన్,  అమృతా తండ్రి క్షితి మోహన్ సేన్.. కబీ గురు రవీంద్ర నాథ్ ఠాగూర్ సన్నిహిత సహచరులు. వాస్తవానికి క్షితి మోహన్ విశ్వభారతికి రెండవ వైస్-ఛాన్సలర్‌గా వ్యవహరించారు. 

అమర్త్య సేన్ చట్టబద్ధమైన వారసుడిగా తన హోదాను పేర్కొంటూ క్యాంపస్‌లోని ప్లాట్‌ను విడిచిపెట్టడానికి నిరాకరించారు. ఆ తర్వాత సీఎం మమతా బెనర్జీ శాంతినికేతన్‌లోని ప్రతిచీ ఇంటిలో సేన్‌ను వద్దకు వెళ్లి స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ భూమి 1943లో సేన్ కుటుంబీకుల పేరిట రిజిస్టర్ అయిందని, దానిని జప్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

మరోవైపు ఈ నోటీసుపై అమర్త్య సేన్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తన వైఖరికి ప్రతీకారం తీర్చుకునే ఎత్తుగడ అని విమర్శించారు. ఇక, మమతా బెనర్జీ సెంటిమెంట్‌ను ప్రతిధ్వనించారు. కక్ష సాధింపు రాజకీయాలు అంటూ యూనివర్సిటీ అధికారులను, కేంద్రాన్ని నిందించారు. అయితే లేనిపోని సమస్యను పెంచే కళలను దీదీ లాంటి నేతలను చూసి నేర్చుకోవాలి. ఇక, మూడో, నాలుగో తరం వారసులు తమ స్వంత స్థిరాస్తిని వేరే చోట కలిగి ఉన్నప్పటికీ ఈ భూమిని ఆక్రమించడం గురించి ఎవరూ బాధపడినట్లు కనిపించలేదు. 

కరివేపాకు
మామిడిపండు గుర్తు ఉన్న పార్టీ తమిళనాడు రాజకీయాల్లో స్పైసీ సిరప్‌లో పడింది. పొలిటికల్ తెరపై తనకంటూ కొంత భాగాన్ని కనుగొనేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అధికార పక్షం నాయకులను సంతోషపెట్టేందుకు.. పార్టీని నడిపించే తండ్రీ కొడుకులు గవర్నర్‌పై దాడికి సులభమైన మార్గాన్ని కనుగొన్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ బిల్లును ఆమోదించడంలో జాప్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ పార్టీ అసమానమైన రీతిలో శబ్దం చేస్తోంది.

అయితే అధికార పార్టీ మిత్రపక్షాలు మాత్రం తండ్రీకొడుకుల ద్వయం ప్రాధాన్యతనిచ్చే చర్యలను వ్యతిరేకిస్తున్నందున ఆమోదయోగ్యమైన వంటకం డీఎంకేకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి తండ్రీకొడుకుల ఆశలు 2024 ఎన్నికల నాటికి పండుతాయా? లేక తారుమారవుతాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.


నిచ్చెన ఎక్కాలని..
రాజకీయ నిచ్చెన (యాదృచ్ఛికంగా.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సింబల్) ఎక్కేందుకు ఏ పార్టీ కార్యకర్తకైనా ఆశ పడటం సహజమనే చెప్పాలి. అయితే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర కమిటీని పునరుద్ధరించేటప్పుడు.. పార్టీలోని తిరుగుబాటు స్వరాలను, ముఖ్యంగా ఆలిండియా జనరల్ సెక్రటరీ పీకే కున్హాలికుట్టిని వ్యతిరేకిస్తున్న వారిని తొలగించేందుకు ఆ పార్టీ కొంత వడపోత కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మార్చిలో జరగనున్న లీగ్ జాతీయ సమావేశానికి ముందు కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి. కేఎస్ హంజా, కేఎం షాజీ, పీఎం సాదికాలితో సహా కున్హాలికుట్టిని వ్యతిరేకిస్తున్న నేతలకు జాబితాలో చోటు దక్కలేదు. మరోసారి ప్రతిపక్ష విభాగంలో దామాషా స్థలం కోసం పార్టీ ఎప్పుడూ గొంతు చించుకునే ద్వంద్వ వైఖరిని ఇది స్పష్టంగా బహిర్గతం చేస్తుంది. దీంతో ఇప్పుడు సెక్రటరీగా పీఎంఏ సలాం కొనసాగుతారని తేలిపోయింది.

తమ జిల్లా యూనిట్లలో కూడా భావసారూప్యత గల పార్టీ సభ్యులను చేర్చుకోవాలని అధికారిక వర్గం కూడా నిర్ధారిస్తోంది. ప్రచారంలో భాగంగా తాజాగా తిరువనంతపురంలో ఓ సినీ నటుడిని తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం జరిగింది. అయితే మొత్తం కసరత్తుపై ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే.. పెద్ద లీగ్‌లో చేరే అవకాశాలు ఇప్పుడు నెరవేరని ఆశయంగా మిగిలిపోతాయని చాలామంది భావిస్తున్నారు.


రాంగ్ పార్కింగ్..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతను ఆయన కుమార్తె వివాహ వేడుక కోసం ఏర్పాటు చేసిన వేదిక ఇబ్బందుల్లోకి నెట్టేలా చేసింది. గతంలో ఎస్పీ ప్రభుత్వం హయాంలో సాధించిన విజయాల్లో ఒకటైన లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్‌లో వివాహ వేడుక వేదికను ఏర్పాటు చేశారు. ఇందుకు యూపీకి చెందిన ముఖ్యనేత కూడా హాజరయ్యారు. వెంటనే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ తమ హయాంలో చేసిన అభివృద్ధి ఆనవాలు బీజేపీ నాయకులకు గమ్యస్థానంగా ఉన్నాయంటూ పోస్టులు పెట్టడం ప్రారంభించాయి. 

ఈ హోరు మరింత పెద్దదవడంతో.. బీజేపీ నాయకులు కూడా ఇది తప్పించుకోలేని ఇబ్బందిగా మారిందని భావిస్తున్నారు. ఆ అగ్రనేత తన కుమార్తె వివాహ వేడుకను వేరే చోట నిర్వహించి ఉండొచ్చు కదా అని అనుకుంటున్నారు. 

‘‘పైలట్’’ కోసం వేట.. 
రాజస్థాన్‌లోని 40 విధానసభ స్థానాలపై గణనీయమైన పట్టు ఉన్న గుజ్జర్ వర్గం గొర్రెల కాపరుల కోసం వెతుకుతున్న మందలా ఉంది. ఇప్పటి వరకు చాలా మంది గుజ్జర్ నాయకులు ఒక కాంగ్రెస్ నాయకుడిని అనుసరించారు. అతను రాజకీయ దృశ్యం ద్వారా వారిని ‘పైలట్’(వారి ఎదుగుదలకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు) చేశారు. కానీ ఆ కాంగ్రెస్ నేత అంతర్గత రాజకీయాలలో చిక్కుకోవడంతో.. ఆయనకు అంతుచిక్కని, రాజకీయ గ్రహణం పట్టింది. ఈ నేపథ్యంలోనే తమకు కొత్త నాయకుడు అవసరమని గుజ్జర్ నాయకులు గ్రహించినప్పటికీ.. వారి అన్వేషణ ఫలించలేదు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజ్జర్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమానికి వారెవరినీ ఆహ్వానించకపోవటంతో రాజకీయంగా అప్రధానంగా మారతామన్న భావన చాలా రెట్లు పెరిగింది. తాము కూడలిలో ఉన్నామని, కొత్త నాయకుడిని త్వరగా గుర్తించకపోతే.. తమ సంఘం త్వరలో రాజకీయ రహదారికి చివరి దశకు చేరుకునే అవకాశం ఉందని ఈ నాయకులు గ్రహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios