Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్: కేరళలో సోలార్ తుఫాన్.. జేడీఎస్-బీజేపీ కూటమి వికసిస్తుందా..!!

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

From the india Gate NO PERMANENT ENEMIES in politics and solar storm in kerala and more
Author
First Published Sep 17, 2023, 1:57 PM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

శాశ్వత శత్రువులు లేరు..
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే మాట తరుచూ వినిపిస్తోంది. అలాగే శత్రువుకి శత్రువు తరచుగా మిత్రుడవుతాడు. తాజాగా ఈ సత్యాన్ని కర్ణాటకలో జేడీఎస్ మళ్లీ ఆవిష్కరించింది. ప్రస్తుతం జేడీఎస్ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత జేడీఎస్ పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పటిష్టతను ప్రదర్శించడానికి జేడీఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే జీవరేఖ కోసం అన్వేషణలో భాగంగా  జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బీజేపీ అగ్రనేతలను కలవడానికి ఢిల్లీకి చేరుకున్నారు. 

దేవెగౌడ తన పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక, బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాలతో దేవెగౌడ భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేవెగౌడతో చర్చలు జరిపారు.

పొత్తుపై ఇప్పుడే పూర్తిస్థాయి స్పష్టమైన ప్రకటన రాకపోయినప్పటికీ.. నాలుగు లోక్‌సభ స్థానాలు - హాసన్, తుమకూరు, కోలార్, బెంగళూరు రూరల్‌లను జేడీఎస్‌కు వదులుకోవడానికి బీజేపీ తాత్కాలికంగా అంగీకరించింది. మరి ఈ విన్-విన్ ఫార్ములా క్లిక్ అయితే.. కర్ణాటకలో కొత్త కూటమి వికసిస్తుంది.

సోలార్ తుఫాను..
సౌర తుఫాన్‌తో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు అస్తవ్యస్థం కావడంతో పాటు జీవజాలం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి  వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే రాజకీయ సమీకరణాలను అస్థిరపరిచేలా కేరళ రాజకీయాల్లో ఇదే విధమైన ‘‘సోలార్ తుఫాను’’ ఏర్పడుతోంది. ఈసారి వెల్లడైన అంశాలు కాంగ్రెస్‌, ఎల్‌డీఎఫ్‌ను వెనుకడుగు వేసేలా చేశారు. 

అందుకు కారణం.. సోలార్ కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన దర్యాప్తు నివేదికలో మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఓ మహిళ.. తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టుగా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఊమెన్ చాందీతో పాటు పలువురు మంత్రులు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని పేర్కొంది. అయితే ఈ కేసు చివరకు సీబీఐకి చేరగా.. ఊమెన్ చాందీపై బాధిత మహిళ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. 

అయితే బాధితురాలిని దుర్భాషలాడిన రాజకీయ నేతల జాబితాలో ఊమెన్ చాందీ పేరు చేరడంతో.. తన జీవితంలోని చివరి కొన్ని సంవత్సరాలలో చాందీ జ్యుడీషియల్ విచారణను ఎదుర్కొన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఒకే రోజు ఏడు గంటలపాటు కమిషన్ ముందు కూర్చున్నాడు. అయితే తాజాగా ఈ కుట్రలో దలాల్ అనే మధ్యవర్తి ప్రమేయం ఉన్నట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అతను బాధితురాలి నుంచి ‘‘ లేఖ’’ కొనుగోలు చేశాడు. దానిని సీపీఎం నాయకులు.. ఊమెన్ చాందీ, యూడీఎఫ్‌ను అస్థిరపరిచేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించారు.

కానీ ఈ డ్రామా యాంటిక్లైమాక్స్ ఊహించని ట్విస్ట్‌ను తెరమీదకు తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తగా.. అన్ని ఆరోపణలకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. అయితే చాందీని ఇరికించేందుకు పన్నిన కుట్రపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు కోరాయి. 

అయితే ‘‘దలాల్’’ మీడియా సమావేశం పెట్టడం కాంగ్రెస్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ లేఖను ఉపయోగించి ఊమెన్ చాందీని పక్కన పెట్టేందుకు మాజీ హోం మంత్రులుగా పనిచేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నారని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు తమ విచారణ డిమాండ్‌పై పూర్తిగా మౌనం దాల్చారు. అయితే ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఒమెన్ తన తండ్రి అడుగుజాడల్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన రోజున జరిగిన ఈ డ్రామా అంతా విధి చమత్కారంగా మాత్రమే చూడోచ్చు. 

బోధన & ఆచరణ.. 
రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ టిక్కెట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్న తరుణంలో.. వేర్వేరు ప్రస్తావనలు, కలయికలు మెదులుతూ ఉన్నాయి. సీనియర్ నేతలకు టిక్కెట్లు ఇవ్వబోమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక, అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీనియర్ నాయకుడైన మంత్రి ఒకరు.. రెండవ శ్రేణి నాయకత్వాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

‘‘మన పిల్లలను రాజకీయాల్లోకి నెట్టకూడదు. అవసరం లేదు.. వారే ముందుకు సాగుతారు. ప్రజలకు సేవ చేద్దాం.. అర్హులైన కార్యకర్తలకు టిక్కెట్లు ఇప్పిస్తాం’’ ఆ నాయకుడు అని పేర్కొన్నారు. ఆయన మాటలకు పెద్ద ఎత్తున చప్పట్లు వచ్చాయి. కానీ చప్పట్ల ప్రతిధ్వనులు ముగియక ముందే.. ఆ నాయకుడు తన కుమారుడికి టికెట్ తెచ్చుకున్న తర్వాత ఈ బోధనలు చెబుతున్నారని పార్టీ శ్రేణులు తెలుసుకున్నారు. 

టర్న్‌కోట్ విలన్..
విలన్లు హాస్యభరితమైన పాత్రలు చేయడం మనందరం చూశాం. కానీ కేరళలో ఒక నటుడు చాలా హాస్యాస్పదంగా అనేక హేళనలను ఆహ్వానిస్తున్నారు. 400కు పైగా సినిమాల్లో నటించిన కండలవీరుడు భీమన్ రఘు..ఆలస్యంగానైనా హాస్య పాత్రల్లో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. కానీ నిజ జీవితంలో అతని విన్యాసాలు ఈ రీల్ పాత్రలను సిగ్గుపడేలా చేస్తుంది. బీజేపీలో చేరి 2016 అసెంబ్లీ నియోజకవర్గంలో పతనాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన భీమన్ రఘు.. ఆ తర్వాత ఒక్కసారిగా రంగు మారారు. సీపీఎంలో చేరి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వంటి ‘‘ధైర్య’’ నాయకుడికి తాను అభిమానినని బహిరంగంగా ప్రకటించారు.

ఇదిలాఉంటే, ఇటీవల రాష్ట్ర చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో పినరయి విజయన్ తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు.. భీమన్ రఘు జాతీయ గీతాన్ని గౌరవిస్తున్న విద్యార్థిలా లేచి నిలబడ్డారు. మెరిసే పసుపు చొక్కా ధరించిన భీమన్ రఘు..  సీఎం విజయన్ తన ప్రసంగాన్ని ముగించే వరకు లేచి నిలబడి ఉన్నారు. 

ఆ దృశ్యం వైరల్‌గా మారింది. ఆ తర్వాత రఘు మీడియాతో మాట్లాడుతూ.. తన చర్య ముందస్తుగా జరగలేదని చెప్పారు. ‘‘నేను పినరయి విజయన్‌ను గౌరవిస్తాను. ఆయన తండ్రి కంటే ఎక్కువ. ముఖ్యమంత్రి విజయన్ తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు తన సొంత తండ్రి పట్ల ఒకరికి కలిగే విస్మయం నాకు కూడా అలాగే అనిపించింది. ఇది నా గౌరవం’’ అని రఘు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios