దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి 14వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 14వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మిల్లెట్ పవర్..
భారతదేశపు మిల్లెట్‌(చిరుధాన్యాల) ప్రమోషన్ డ్రైవ్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. చిరుధాన్యాలను పోషకాహారానికి కొత్త వనరుగా ప్రకటించిన భారత్.. ప్రపంచాన్ని కూడా దానిని అనుసరించమని కోరింది. ఈ పరిణామ క్రమంలోనే పార్లమెంట్‌ లోపల మెనూలో ఇప్పుడు కొత్త చేరికను కలిగి ఉంది. అవును మీరు ఊహించినది నిజమే.. ఇది వివిధ రకాల మిల్లెట్ల కిచిడీ. పార్ల‌మెంట్ ఫుడ్ కోర్ట్‌లో ‘‘మిల్లెట్ మెనూ’’ ఫోటో ఒకటి తెర‌పైకి వ‌చ్చింది. మిల్లెట్ గింజలతో చేసిన కిచిడీ, బజ్రా కిచిడీని ఇందులో చేర్చారు.

2018లో పౌష్టికాహారం కొత్త మూలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఏడాదిని భారత ప్రభుత్వం చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచంలో చిరుధన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ప్రధానమంత్రి మోదీ ఆలోచనను 70 దేశాలుఆమోదించాయి. మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023ని ‘‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’’గా ప్రకటించింది. 

ముతక ధాన్యాల ఉత్పత్తిని సులభతరంగా ప్రోత్సహించడానికి ప్రణాళికలను రూపొందించడం ద్వారా పోషకాహార లోపంతో పోరాడటానికి సమర్థవంతమైన మార్గాన్ని ఆవిష్కరిస్తూ.. ఎంఐఐఆర్‌ఏ (మిల్లెట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ రీసెర్చ్ అండ్ అవేర్‌నెస్)లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చిరుధాన్యాల ఉత్పత్తి చేసే దేశంగా భారతదేశం ఉంది.

బోస్ ఈజ్ రైట్
బోస్ ఎప్పుడూ సరైనవారే. బీజేపీ కేంద్ర నాయకత్వం తన బెంగాల్ యూనిట్‌కు ఈ సందేశాన్ని బిగ్గరగా, స్పష్టంగా అందించినట్లు కనిపిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు గవర్నర్‌‌ల మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గ సీబీ ఆనంద బోస్‌ను కొనసాగించడం ద్వారా.. కేంద్ర నాయకత్వం ఆయన వ్యుహాన్ని ఆమోందించింది. 

అయితే బోస్ గతంలో ఉన్న గవర్నర్ మాదిరిగా కాకుండా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతొ మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నాయి. అది కూడా బెంగాల్ బీజేపీ యూనిట్ చీఫ్ నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుని చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే బోస్‌ను రీకాల్ చేయాలనే అభ్యర్థనలు కూడా వెళ్లాయి. అయితే వాటిపై కేంద్ర నాయకత్వం తక్కువ శ్రద్ద కనబరిచింది. అయితే రాష్ట బీజేపీ నేతల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో.. ప్రధాని మోదీతో బోస్ సమావేశమయ్యారు.

రోజువారీ గొడవలు కాకుండా మమతతో కలిసి పనిచేయాలనే బోస్ వ్యూహానికి ప్రధాని మోదీ పూర్తి మద్దతునిచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయం కేవలం 15 నిమిషాల స్లాట్‌ను మాత్రమే ఇచ్చినప్పటికీ.. మోదీతో బోస్ సమావేశం గంటపాటు కొనసాగింది. బోస్‌తో సమావేశాన్ని 45 నిమిషాలు పొడిగిస్తూ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ తొలిసారిగా అర్థం చేసుకున్నారు.

ఆనంద బోస్ కూడా మజుందార్‌కి తన స్టాండ్‌ని వివరించాడు. అయితే ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాత్రం బోస్ వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక, రాజ్‌భవన్‌లో తన సెక్రటరీగా నియమించబడిన మమతకు నమ్మకస్తురాలైన నందినీ చక్రవర్తిని సంబంధాలను పటిష్టం చేయడం కోసం వదిలిపెట్టాలని బోస్ నిర్ణయించుకున్నారు. కానీ బీజేపీ ఆమెకు వ్యతిరేకంగా ఉంది. ఆమెను తొలగించాలని కోరింది.


కాంగ్రెస్ థరూర్ ఫోబియా..
మనసులో చాలా పెద్ద ఫోబియా మెరుపులా ఉన్నప్పటికీ ఇది స్వీయ వివరణాత్మకమైనది. వర్కింగ్‌ కమిటీ నుంచి ఎంపీ శశిథరూర్‌ను తప్పించేందుకు కాంగ్రెస్‌ కిచెన్‌ క్యాబినెట్‌ మరోసారి వ్యూహరచన చేస్తోంది. త్వరలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో ప్యానెల్‌ను పునర్‌నిర్మించే అవకాశం ఉంది. అయితే థరూర్ మద్దతుదారుల బృందం అతడి సీడబ్ల్యూసీ ప్రవేశానికి తగినంత మద్దతును సంపాదించడానికి ఇప్పటికే చర్యలో ఉంది. ఇటీవల బీబీసీ డాక్యుమెంటరీపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రముఖ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ థరూర్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. అయితే తాను ప్యానెల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సీనియర్ నేత ఏకే అంటోని చెప్పడంతో.. యాదృచ్ఛికంగా సీడబ్ల్యూసీ ఖాళీలలో అది ఒకటిగా నిలిచింది. ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి కూడా ఉంది. 

థరూర్‌కు మద్దతిస్తున్న వారిలో కార్తీ చిదంబరం, సల్మాన్ సోజ్, ఎంకే రాఘవన్ ఉన్నారు. కాంగ్రెస్‌లో అసమ్మతి గ్రూప్‌గా ముద్రపడ్డా జీ23 ఇటీవల క్షీణించినప్పటికీ.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్ హుడా ఢిల్లీలో ఏర్పాటు చేసిన విందులో తిరిగి సమూహాన్ని సూచించే కొన్ని తాజా పరిణామాలు కనిపించాయి. ఈ విందుకు ఆనంద్ శర్మ, అశ్వనీ కుమార్ సహా అసంతృప్త నేతలు హాజరయ్యారు. 

కాంగ్రెస్ భవిష్యత్తును మరింత రుచికరంగా మార్చేందుకు వంటకాలను చర్చించడంలో బిజీగా ఉన్న రాజకీయాలను.. చక్కిలిగింతలు పెట్టేందుకు ప్రత్యేకమైన ఉత్తర భారత వంటకాలను మెనూలో ప్రదర్శించారు. ఈ ఆహారాన్ని ఆనందిస్తారని ఆశించవచ్చు. 

ఉచితాల వర్షం.. 
కర్ణాటకలో ఉచితాల వర్షం కురుస్తోంది. ప్రతి గుమ్మం వద్ద.. కుక్కర్లు, టెలివిజన్లు, వస్త్రాలు, మద్యం, ఆహారం, వంటి ఇతర ఉచితాను ఆకాశం నుంచి జారవిడుస్తున్నారు. అయితే ఈ పరిణామాల వెనక పెద్ద రహస్యాలు కూడా లేవు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లకు చేరువయ్యేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఇవి. అయితే ఈ వర్షం.. వస్తువులతో మాత్రమే ముగియవు. కొన్ని ప్రాంతాలలో ప్రజలను సమీపంలోని కేంద్రాలకు ఉచిత తీర్థయాత్రలను అందిస్తారు. ఈ కసరత్తు ప్రభుత్వ యాజమాన్యంలోని రవాణా సంస్థల ఖజానాను కూడా నింపుతోంది.

స్థానిక తీర్థయాత్ర కేంద్రాలలో దర్శనం తర్వాత ఓటర్లు తమను ఆశీర్వదించబడినట్లు భావిస్తుండగా.. ఈ ఓటర్లను ప్రభావితం చేసే స్థానిక నాయకులు మరొక రకమైన టూర్‌లో పాల్గొంటారు. అలాంటి వందలాది మంది స్థానిక రాజకీయ నాయకులు బ్యాంకాక్ దర్శనం తర్వాత తిరిగి వచ్చారు. తదుపరి ఫ్లైట్ కోసం చాలా మంది క్యూలో ఉన్నారు.

అయితే తాజాగా ఓ ఆసక్తికర ప్రశ్న వినిపిస్తోంది. తమ యాత్రను స్పాన్సర్ చేసిన పార్టీకే ఓట్లు వేస్తామని భక్త ఓటర్లను దేవుడి పేరుతో ప్రమాణం చేయిస్తున్నారు. అయితే బ్యాంకాక్ భక్తులు ఎవరిపై ప్రమాణం చేస్తారు?. 


తలుపులు తడుతున్న ఖాకీలు..
అయితే అంతగా స్వాగతించని కొన్ని పరిణామాలు బెంగాల్ రాజకీయ వర్గాలను కుదిపేస్తున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంలో దువారే పోలీసుల చొరవను ప్రతిక్ష నాయకులు అనుమానంగా చూస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ఓటర్లను బెదిరించే ఎత్తుగడగా ప్రతిపక్షాలు దీనిని అభివర్ణించాయి. ఇందుకు వారు బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హట్‌లోని ఒక గ్రామం నుంచి ఇటీవల వైరల్ అయిన వీడియోను ఉదహరించారు. అక్కడ పోలీసులు పంచాయితీ గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో పరిష్కరించలేని వారి ఫిర్యాదులను జాబితా చేయాలని నివాసితులు కోరారు.

పోలీసుల గూండాయిజం అంటూ బీజేపీ నేత సజల్ ఘోష్ ఓటరుపై ఒత్తిడి తెచ్చే పథకంలో భాగమని అన్నారు. సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి ఈ చొరవను మరింత విమర్శిస్తూ.. ఇది టీఎంసీకి సహాయం చేయడానికి వేసిన ఎత్తుగడ అని పేర్కొన్నారు.

అయితే టీఎంసీ మీడియా సెల్ ఇన్‌ఛార్జ్ దేబాంగ్షు ముఖర్జీ మాత్రం.. ప్రజల ఆందోళనలను అంచనా వేయడానికి ఈ చొరవను ఒక ప్రత్యేకమైన చర్యగా సమర్థించారు. తమ ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదని దువారే పోలీసులు నిరూపించారని.. ప్రజల ఫిర్యాదులు, సమస్యలను అర్థం చేసుకోవడంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. 


బ్యూరో క్రేజీ.. 
దీనిని బ్యూరోక్రాటిక్ కబడ్డీ గేమ్ అని పిలవండి. ఇక్కడ ప్లేయర్ తన ప్రత్యర్థి ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ కూడా ఆమెను/అతడిని ఓడించడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తారు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఇద్దరూ తమ కెరీర్ చివరి దశలో ఉన్న తమిళనాడు బ్యూరోక్రసీలోని ఉన్నత స్థాయిలలో ఇదే విధమైన ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

గత పునర్విభజన సమయంలో తమినాడు యేతర అధికారులు ఈ స్థానాలను ఆక్రమించకుండా నిరోధించడంలో వారు విజయం సాధించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వారిని వారి సంబంధిత పోస్టుల నుండి రిటైర్ చేయాలని నిర్ణయించింది. కొంతమంది సీనియర్-మోస్ట్ అధికారులు సెంట్రల్ డిప్యూటేషన్ నుంచి తిరిగి రావడంతో.. పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినంత వరకు సజావుగా మారడానికి పిచ్ ఇప్పుడు స్పష్టంగా ఉంది.

అయితే ప్రధాన కార్యదర్శి పదవికి ఉత్తర భారత సంతతికి చెందిన ఇద్దరు అధికారుల మధ్య పోటీ నెలకొంది. ఇద్దరూ కూడా ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రముఖ కోలీవుడ్ నటుడి పేరున్న అధికారి మాత్రం రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. రీల్ అవతార్‌ల కంటే ఈ రియల్ డ్రామాలో ఎక్కువ సస్పెన్స్ ఉందని ఒప్పుకోక తప్పదు.