దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 24వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీ ఫైల్స్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్న హాట్ ఎయిర్ బెలూన్‌ను సూది గుచ్చినట్లుగా ఉంది. ‘‘మీరు మూడు రోజులు కూర్చున్నారు. కొన్ని మార్పులు మాత్రమే చేశారు’’ అని బీజేపీ ముఖ్య నాయకులను మోదీ అడిగారు. బీజేపీ ముఖ్య నాయకులు కర్ణాటకలో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థుల ‘‘రివైజ్డ్’’ జాబితాను ప్రధాని మోదీకి అందజేసిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే ముందు రోజులలో జరిగిన తీవ్రమైన చర్చల మీద చల్లటి నీటిని కురిపించినప్పటికీ.. ప్రతి నియోజకవర్గంలో నాడిని ప్రధాని మోదీ ఎలా చదవగలరని ప్రశ్న మరోసారి తెరమీదకు వచ్చింది.
మోదీ పాయింట్ చేసిన జాబితాలోని అభ్యర్థులలో 50:50 గెలుపు అవకాశం ఉన్న పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో జగదీష్ షెట్టర్, ఈశ్వరప్ప వంటి అనుభవజ్ఞుల పేర్లు కూడా ఉన్నాయి. ఇక, అభ్యర్థులను సూచించే సమయంలో జరిగిన రాజీల తంతును గుర్తించిన మోదీ.. అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. 50:50 జాబితాలోని అందరి పేర్లను తొలగించి కొత్త జాబితాను రూపొందించారు. ఈ పేర్లను అమలు కోసం రాష్ట్ర నాయకులకు పంపించారు.
అయితే జగదీష్ షెట్టర్‌ను పార్టీని వీడకుండా ఉండాల్సిందని ఢిల్లీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆయనతో ధర్మేంద్ర ప్రధాన్‌కు బదులు అమిత్ షా లాంటి బలమైన వ్యక్తి మాట్లాడి ఉంటే ఈ విపత్తును అరికట్టే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా షెట్టర్ ఫ్లాప్ షో కావడంతో పార్టీ సీనియర్‌లు ఆయన పేరును వదులుకునేలా చేసినప్పటికీ.. ఆయన సీనియారిటీని గౌరవించాలనే ఆలోచన మాత్రం ఉంది. వాస్తవానికి ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం.. జీవర్గి (కలబురగి జిల్లా) నుంచి పోటీ చేసే ప్రతిపాదనను తిరస్కరించిన లక్ష్మణ్ సవాడి పార్టీని వీడతారని భావించింది. అది అలాగే జరిగింది. కానీ జగదీష్ షెట్టర్ పార్టీ నుంచి నిష్క్రమించడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇదిలా ఉంటే.. పుత్తూరు, సుళ్య, ఉడిపి, కాపు సహా పలు నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను రంగంలోకి దింపేందుకు ఈ కసరత్తు పార్టీకి దోహదపడింది.
వరుణ రాజకీయం..
కర్ణాటకలోని వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్యపై పోటీకి బీజేపీ వి సోమన్నను బరిలో నిలిపింది. అయితే ఈ పరిణామాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి.. తన కుమారుడు బీవై విజయేంద్రను ఇక్కడ పోటీకి దింపేందుకు బీఎస్ యడ్యూరప్ప నిరాకరించడంతో సోమన్నను పోటీ చేయమని బీజేపీ అధిష్టానం కోరింది. అయితే వరుణ స్థానానికి సోమన్నను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ పక్కా వ్యూహాన్ని ప్రదర్శించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే.. వారి లెక్కలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
బీజేపీ చేపట్టిన ఈ వ్యుహాం.. సిద్ధరామయ్య కదలికలను వరుణకు పరిమితం చేసేలా ఉంది. వెనుకబడిన వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు కర్ణాటకలోని మరే ఇతర ప్రాంతాలలో ప్రచారం చేయకుండా సిద్దరామయ్యను నిరోధిస్తుందనే ఆలోచనలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే.. లింగాయత్ నాయకుడు కావడంతో సోమన్న ఆ సామాజికవర్గం ఓట్లను పొందడానికి అవకాశం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.
అలాగే.. కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ స్థానంలో ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు దృష్ట్యా సోమన్న గెలిచే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే సీఎం కుర్చీని దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య గెలుపు అవకాశాలను కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా దెబ్బతీస్తారని వారు అంతర్గత ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈసారి వరుణ నియోజవర్గంలో ఖచ్చితంగా బయటకు కనిపించే పరిస్థితులకు విరుద్దంగా పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు.
ఎర్రజెండాకు బదులు పచ్చ జెండా..
బహుశా దేశంలో ఒక ఎయిర్‌లైన్ కంపెనీకి వ్యతిరేకంగా బహిష్కరణను బహిరంగంగా ప్రకటించిన ఏకైక రాజకీయ నాయకుడు ఆయనే. ఆ నాయకుడే సీపీఎం నేత ఈపీ జయరాజన్. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా ఆయన ఈ విధమైన ప్రకటన చేశారు. అయితే కన్నూర్ నుండి తిరువనంతపురం వెళ్లే విమానంలో జరిగిన గొడవల కారణంగా ఆయనపై విధించిన స్వల్ప నిషేధానికి ప్రతీకార యత్నంలో భాగంగా ఈ చర్య జరిగింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే తన స్వస్థలమైన కన్నూర్, రాజధాని తిరువనంతపురం మధ్య మరో విమానయాన సంస్థ సేవలు లేవని తెలుసుకున్నారు. దీంతో ఆయన సమస్యను పరిష్కరించడానికి కొన్ని ట్రాక్ 2 ఛానెల్‌లను ప్రయత్నించారు. కానీ అవేవీ పరిష్కారానికి నోచుకోలేదు.
అయితే తాజాగా వందే భారత్ రావడం.. దాదాపు ఆరు గంటల్లో తిరువనంతపురం నుంచి కన్నూర్ చేరుకోవడానికి వీలు కల్పించనుంది. ఈ క్రమంలోనే వందేభారత్‌కు సీపీఎం ఇంకా స్వాగతం పలకనప్పటికీ.. లోకో పైలట్‌లను సన్మానించేందుకు ఈపీ జయరాజన్ చొరవ తీసుకున్నారు. వందే భారత్‌పై ప్రచారం కోసం కసరత్తు చేస్తున్న బీజేపీ నాయకులను కూడా ఈపీ జయరాజన్ చర్య ఆశ్చర్యపరిచింది.
అయితే ఈపీ జయరాజన్‌కు సన్నిహితంగా ఉండే వర్గాలు.. వందే భారత్‌ను రైలు రావడం సంతోషంగా ఉందని చెబుతున్నాయి. మరిన్ని వందే భారత్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నట్టుగా పేర్కొన్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం ఈపీ జయరాజన్ కన్నూర్ చేరుకోవడానికి రాత్రిపూట రైళ్లలో బలవంతంగా వెళ్లాల్సి వస్తుంది. లేదా లాంగ్ డ్రైవ్‌లను నివారించడానికి ప్రయాణం మధ్యలో విరామం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వందే భారత్ ఆయనకు వేగంగా కన్నూర్ చేరుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ క్రమంలోనే వందేభారత్‌కు స్వాగతం పలికేందుకు ఈపీ జయరాజన్ పార్టీ ఎర్రజెండాను పక్కనబెట్టి పచ్చజెండా ఊపడంలో ఆశ్చర్యం లేదు.
తప్పిపోయిన గొర్రెల కాపరులు..
రాజస్తాన్‌లో భరత్‌పూర్ జిల్లాలో 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధించిన మాలి, మౌర్య, కుష్వాహ సహా ఆరు సంఘాల సభ్యులు అనాథలుగా మిగిలారు. ఎందుకంటే.. వారి నాయకులు రాత్రికి రాత్రే అదృశ్యమయ్యారు. అంతకంటే ముందు ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత ఆ నాయకులు ఇచ్చిన మౌఖిక హామీలు.. అక్కడ నిరసన కొనసాగిస్తున్న వారిని సంతృప్తి పరచలేదు. దీంతో రహదారి దిగ్బంధనాలను తొలగించాలని నాయకులు చేసిన విజ్ఞప్తిని వారు తిరస్కరించారు. ఈ క్రమంలోనే ఆ నాయకులు అదృశ్యమయ్యారు.
అయితే రోడ్డు దిగ్బంధనాలను ఆపకుంటే కఠిన చర్యలు తప్పవని ఆ నాయకులను సీఎం హెచ్చరించారని ప్రచారం తెరమీదకు వచ్చింది. బెదిరింపులకు దిగిన సీఎం, మాట వినని కార్యకర్తల మధ్య చిక్కుకున్న నేతలకు అక్కడి నుంచి తప్పించుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
భూత్ బంగ్లా..
యూపీ ప్రభుత్వంలోని మంత్రులు ఉపయోగించే బంగ్లా ఒకటి భూత్ బంగ్లా అనే భావన ఉంది. అక్కడ ఏదో చెడు శక్తి ఉందని.. దురదృష్టాన్ని కలిగిస్తుందని కొందరు నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం ఆ బంగ్లాలో ఉంటున్న ఓ మంత్రి కూడా.. తన రాజకీయ గ్రాఫ్ పడిపోవడానికి అదే కారణమని నమ్మడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆయనను సైడ్ లైన్ చేయడంతో.. పలు నిర్ణయాలను ఆయనకు తెలియజేయడం లేదు. ఈ క్రమంలోనే ఆయన అనుమానాలు మరింత బలపడ్డాయి.
ప్రయాగ్‌రాజ్ సివిక్ ఎన్నికల్లో తన భార్యకు పోటీ చేయడానికి టిక్కెట్ నిరాకరించడానికి ఈ భవనమే కారణమని ఆ మంత్రి ఆరోపించారు. ఆమె పోటీ చేస్తే మేయర్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. అయితే ఆ భవనంలో గతంలో నివసించిన చాలా మందిని దురదృష్టం వెంటాడిందని.. ఈ క్రమంలోనే మంత్రి అక్కడే నివసించాలా? లేదా వదిలి వెళ్ళలా? డైలమాలో ఉన్నారు.
