Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్: ఎస్పీకి ఇబ్బందికరంగా ఆ కామెంట్స్, ఆప్ ఎందుకిలా?, లోకేష్ పాదయాత్ర ఉద్దేశం అదేనా..

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

from the india gate from SP leader Comments and AAP kerala unit to Lokesh padayatra
Author
First Published Jan 29, 2023, 10:24 AM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 10వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా కాల్పులు..
దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రచారంలో దూసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఇటువంటి సమయంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒక నాయకుడు తన పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారు. ఒక రకంగా పార్టీని కాల్చి చంపారు. ఇందుకు రామచరితమానస్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. ఆయన  ఓ సందర్భంలో మాట్లాడుతూ.. రామచరితమానస్‌‌ను తులసీదాస్ ఆయన సంతోషం కోసం రాశారని, కానీ వెనుకబడిన తరగతులను కించపరచేలా దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ విధమైన కామెంట్స్ ద్వారా ఎస్పీ అధిష్టానాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టారు. 

అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇది అనుకోకుండా అన్న మాట కాదని సమాజ్‌వాదీ పార్టీలోని చాలా మంది నమ్ముతున్నారు. పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇలా చేశాడని వారు భావిస్తున్నారు. ఇందుకు పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన తన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆయన ఆశలు ఆదిలోనే తుడిచిపెట్టుకుపోయాయి. అయితే ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ రామ్‌చరితమానస్‌పై ఇటువంటి ప్రసంగం చేయడం ద్వారా తనపై చర్య తీసుకోవాలని ఆ నేతే పార్టీ అధిష్టానాన్ని ఒత్తిడి చేయడమేనని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పార్టీ ఎటువంటి చర్య తీసుకున్న ఆయన మైనారిటీ ఓటర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం కూడా కనిపిస్తోంది. 

మరో వైపు...
రాజస్థాన్‌ కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు ఓ అనుభవజ్ఞుడైన బీజేపీ ఎంపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలో ఆయన కీలకంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. ప్రతిపక్షం నుంచి గట్టిగా వాయిస్ వినిపిస్తున్న ఏకైక వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీసిన తీరు, భారీ మాస్ అప్పీల్, అనుచర గణం.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక పాఠం. టీచర్ల రిక్రూట్‌మెంట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ జైపూర్‌లో ఆయన ఇటీవల ప్రారంభించిన ఆందోళన ఇందుకు ఉత్తమ ఉదాహరణ. ఆ పరిస్థితిని పరిష్కరించడానికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ సీనియర్ నేత వెనక్కి తగ్గలేదు. మరోవైపు ఆ నేతకు కేబినెట్‌ బెర్త్‌ లభిస్తేనే ఆయన పలుకుబడి మరింత పెరుగుతుందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

‘‘ఆప్’’ ఎందుకిలా..
ఆమ్ ఆద్మీ పార్టీ కేరళ శాఖ అసమానమైన సమస్యను ఎదుర్కొంటోంది. కేరళలో ప్రస్తుతం ఉన్న పార్టీ ఆఫీస్ బేరర్లను తొలగించిన జాతీయ నాయకత్వం తక్షణ నష్టనివారణ చర్యలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే ఈ పరిణామంతో రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. జాతీయ నాయకత్వం తన కేరళ యూనిట్‌ను అనాథగా మారుస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కేరళ అనుకూలమైన ప్రాంతమని ఆ పార్టీ అగ్రనాయకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. కానీ పార్టీ నాయకులపై మాత్రం ఉదాసీనతగా వ్యవహరించడంతో.. వారిలో అసంతృప్తి సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నాయి. ఇందులో చాలా మంది ప్రసిద్ద సామాజిక కార్యకర్తలు, రచయితలు కూడా ఉన్నారు. 

మరోవైపు తెలంగాణలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవలంబించిన వైఖరి పార్టీ నేతలకు మరింత అవమానకరమైనది. కేరళ అభివృద్ధికి సంబంధించి సీఎం పినరయి విజయన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన కేజ్రీవాల్.. ‘‘ఇది దేశానికే ఆదర్శం’’ అని అభివర్ణించారు. అయితే కేజ్రీవాల్ మాటలు రాష్ట్రంలో పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచాయి. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ కొత్త నాయకుడి కోసం వేట కొనసాగుతుంది. కేజ్రీవాల్ విధానం ప్రకారం.. ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా కార్పోరేట్ స్టైల్‌లో కాబోయే ఆఫీస్ బేరర్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుందని భావిస్తున్నారు. 

వదిలిపెట్టారు..
ఖచ్చితంగా.. ఇటీవల చోటుచేసుకున్న ఓ పరిణామం రాజస్థాన్ బీజేపీలోని ఈ వీఐపీ నేతలు అసౌకర్యంగా ఉన్నారని సూచిస్తుంది. సాధారణంగా ఆ బీజేపీ నేతలకు వచ్చే అన్ని ఆహ్వానాలను అంగీకరించడం కష్టంగా ఉంటుంది. కానీ తాజాగా చోటుచేసుకన్న ఓ పరిణామం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే.. ఒక జాతీయ నాయకుడి కుమారుడి వివాహానికి ఆహ్వానితుల జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. ఆ నేత 20 పేర్లతో కూడిన షార్ట్ లిస్ట్‌ను మాత్రమే సిద్ధం చేశారు. కానీ ఆ తర్వాత అది కేవలం రెండు పేర్లకు కుదించబడింది. దీంతో ఇలా ఎలా జరిగిందో అర్థం చేసుకోలేక ఆ నేతలు  గందరగోళానికి గురయ్యారు.

మరోవైపు ఈ ఇబ్బంది గురించి ఎవరితోనూ చర్చించుకోలేని దుస్థితి వారిది. ఆహ్వానితుల జాబితాలో ఎడిటింగ్ కత్తెర ఒక ప్రముఖ రాష్ట్ర స్థాయి నాయకుడి చేతిలో ఉందని చాలా మంది అనుమానిస్తున్నారు. అతనికి ఇతర నేతలు లైమ్‌లైట్‌లోకి రావడం ఇష్టం లేదని చెబుతున్నారు. 

బోస్‌గా ఉండటం.. 
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌ ఎర్రజెండా ఎగరవేయాలని రాష్ట్ర కాషాయ పార్టీ నేతలు చూస్తున్నారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ బెంగా గవర్నర్‌గా ఉన్న సమయంలో రాజ్‌భవన్‌‌కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య పోరు సాగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కాషాయ పార్టీ నేతలు కూడా.. ఇందుకు సీక్వెల్‌ను ఆశించారు. కానీ కొత్తగా గవర్నర్‌గా వచ్చిన బోస్‌ మాత్రం వేరే లైన్ తీసుకుని బెంగాలీ భాషలో పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించారు.

ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా గతంలో రాజ్‌భవన్‌తో ఉన్న విభేదాలను ముగించాలని భావిస్తున్నట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. ఈ క్రమంలోనే బెంగాలీ అక్షర ప్రపంచంలోకి కొత్త గవర్నర్‌ ప్రవేశించేందుకు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకకు మమతా బెనర్జీ హాజరయ్యారు. ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారిని ఆహ్వానించినప్పటికీ.. ఆయన ఈ వేడుకకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని కూడా విమర్శించారు.

అయితే రాజ్‌భవన్‌లో సీనియర్‌ బ్యూరోక్రాట్‌ ఉండటం.. గవర్నర్‌, ప్రభుత్వం మధ్య సంబంధాలు సజావుగా సాగేందుకు వ్యూహంగా బీజేపీ పేర్కొంటోంది. అయితే ఆ మహిళా ఐఏఎస్ అధికారిణి మమతకు అత్యంత సన్నిహితురాలు.

మైళ్ళు ముందుకు వెళ్ళాలి..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారసుడు  నారా లోకేష్ జనవరి 27న 4,000 కి.మీ పాదయాత్రను ప్రారంభించారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను నిరూపించుకునే సత్తా చాటేందుకు లోకేష్ ఈ యాత్ర చేపట్టారనే వాదనలు ఉన్నాయి. గతంలో చోటుచేసుకున్న పలు అంశాలను ప్రస్తావిస్తూ.. రాజకీయ విశ్లేషకులు ఈ మాటను తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో పాదయాత్రలు చేసి పలువురు నేతలు సీఎం పీఠానికి చేరుకున్నారు.

తెలుగుదేశం పార్టీని స్థాపించిన వెంటనే సీనియర్ ఎన్టీఆర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఆ ఫలితంగా కాంగ్రెస్‌ను చిత్తు చేయడంలో టీడీపీ ఘన విజయం సాధించింది. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుమారుడు కూడా తన పార్టీ విజయం కోసం ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. 

గతంలో చంద్రబాబు నాయుడు తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు పాదయాత్ర కూడా చేపట్టారు. ఇప్పుడు చంద్రబాబు కొడుకు లోకేష్.. తండ్రి కంచుకోట అయిన కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తుంటే సహజంగానే ఉత్సుకత నెలకొంది. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన యాత్ర ద్వారా రాష్ట్రంలో టీడీపీని పుంజుకోనేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ విజయం సాధిస్తే.. ఎక్కువ మంది ఆశావహులు ముఖ్యమంత్రి పదవిని చేరుకోవడానికి సుదీర్ఘ పాదయాత్రలు చేపట్టే మార్గాన్ని అనుసరించే అవకాశాలు లేకపోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios