దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 25వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమతో కూడిన కౌగిలి..
మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో లాక్ చేయబడిన మనస్సులను తెరవడానికి సమర్థవంతమైన పాస్‌వర్డ్‌గా ప్యార్ కి జప్పీని (ప్రేమతో కూడిన కౌగిలి) పరిచయం చేశారు. రాహుల్ గాంధీ చేసిన అలాంటి చర్య ఇప్పుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కోలార్ కలను వదులుకునేందుకు ఒప్పించినట్లు కనిపిస్తోంది. సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గానికే పరిమితం కావడానికి కారణమేమిటో కర్ణాటక మొత్తానికి తెలియదు. సిద్దరామయ్య మంచి మూడ్‌లో ఉన్నారని గుర్తించే వరకు జర్నలిస్టులు కూడా ఎవరూ ఆయనను ఈ విషయం అడగలేదు.
అయితే కొన్ని రోజుల తర్వాత ఒకరు అడగడంతో సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఒక ‘‘అబ్బాయి’’ చిరునవ్వుతో తనను కౌగిలించుకుని కోలార్ వద్దని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత ఆ అబ్బాయి.. రాహుల్ గాంధీ అని సిద్ధరామయ్య ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ రాహుల్ చర్యతో ఆయనకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కానీ కాంగ్రెస్ ఈ కౌగిలింత దౌత్యం ద్వారా ఆయనను వరుణ నియోజకవర్గానికే పరిమితం చేసింది.
అయితే దీని గురించి తెలుసుకున్న కొందరు జర్నలిస్టులు.. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ఇలాంటి ట్రిక్‌నే ప్రధాని మోదీపై ప్రయత్నించిన సందర్బాన్ని గుర్తుచేశారు. అయితే అది అపహాస్యానికి గురైన సంగతి తెలిసిందే.
ఔట్ ఆఫ్ ఫోకస్..
కేరళలోని రోడ్లపై ఏఐ కెమెరాల ఏర్పాటులో భారీ స్కామ్ జరిగిందని.. రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కేరళ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. అయితే ఆరోపించిన కుంభకోణంపై వామపక్ష ప్రభుత్వం దాదాపుగా స్పందించలేదు. ఈ పరిణామాలు సామాన్యులలో అనేక ప్రశ్నలను తలెత్తేలా చేస్తున్నాయి. సదురు ఎల్‌డిఎఫ్ మంత్రిత్వశాఖపై అనేక ఇతర ఆరోపణల మాదిరిగానే ఆరోపణలు రావడం.. ప్రధానంగా ముఖ్యమంత్రి సన్నిహితులకు సంబంధించినవి కావడంతో.. ప్రతిపక్షాలు కూడా క్లిప్ హౌస్(ముఖ్యమంత్రి అధికారిక నివాసం)కు కనెక్ట్ చేసేలా ఫైళ్లను స్కాన్ చేస్తున్నాయి.
అయితే హాస్యాస్పదంగా కాంగ్రెస్ అగ్రనేతలందరూ ఆధారాలను విడుదల చేయడానికి విడివిడిగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ తన ఆధారాలతో రావడానికి కంటే చాలా ముందుగానే.. అదే పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు రమేష్ చెన్నితాల ఈ అక్రమ ఆరోపణలకు మద్దతుగా అనేక పత్రాలను బయటపెట్టారు. తర్వాత వెంటనే మీడియాతో సమావేశమైన కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనకు దిగారు.
అయితే ప్రభుత్వం అన్ని వివాదాలను విస్మరిస్తూనే ఉన్నప్పటికీ.. కేరళ ఇప్పటికీ ఈ కుంభకోణానికి వ్యతిరేకంగా ఎటువంటి ఉమ్మడి ఆందోళనను చూడలేదు. మరోవైపు బీజేపీ పరిస్థితి కూడా అలానే ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ఒంటరిగా వెళ్లేందుకు శోభా సురేంద్రన్ మొగ్గుచూపడంతో ఆ పార్టీలో కూడా చీలిక ఉన్నట్టుగా కనిపిస్తోంది. గ్రూపిజం అనేది ప్రతి రాజకీయ పార్టీని వేధిస్తున్నందున.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణల పరంపర నుంచి కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. సీసీటీవీ స్కాంపై ఉమ్మడి పోరాటంపై ప్రతిపక్ష పార్టీల నేతలు నిజంగా ఫోకస్ లేకుండా కనిపిస్తున్నారు.
క్యూబా మోడల్..
ప్లేటోనిక్ సోషలిస్ట్ గమ్యస్థానంగా కాకుండా.. కేరళ ప్రభుత్వం క్యూబా మోడల్ నుండి నేర్చుకునే ఏ అవకాశాన్ని కోల్పోదు. ఆరోగ్య సంరక్షణలో నుంచి దోమల నిర్మూలన వరకు.. వరుసగా వచ్చిన ప్రభుత్వాలు క్యూబన్ పద్ధతుల్లో ఉత్తమమైన వాటిని తీసుకోవడానికి ప్రయత్నించాయి. కానీ వాటిలో ఒక్కటి కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
ఆరోగ్య సంరక్షణ నమూనా వంటి వాటిలో కొన్ని ఫ్లాట్‌గా పడిపోయాయి. నిజానికి తిరువనంతపురంలో అలాంటి ఒక ప్రయత్నం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిని పనికిరాకుండా చేసింది. అదేవిధంగా, దోమలను నిర్మూలించడానికి క్యూబన్ మోడల్.. ఈ ప్రక్రియలో ఉపయోగించాల్సిన ఔషధం భారీ ధర కారణంగా ప్యూపా దశను ఎప్పటికీ వదిలిపెట్టలేదు.
ఇంత జరిగినా.. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి క్యూబా నుండి మరింత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొనేందుకు యుఎఈని సందర్శించాలన్న ముఖ్యమంత్రి అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిన తర్వాత చాలా మంది దీనిని టిట్-ఫర్-టాట్ చర్యగా భావిస్తున్నారు. అయితే క్యూబా వేషధారణలో క్విక్సోటిక్ ప్రాజెక్ట్‌లను చుట్టడానికి కమ్యూనిస్ట్ రొమాన్స్ కారణమని మరొక వాదన ఉంది. అయితే తదుపరి వివరాలు తెలిసేవరకు వేచి చూద్దాం.
పెరిగిన పవర్..
జేడీఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణ హాసన్ సీటుపైనే కన్నేసిన సంగతి తెలిసిందే. ఈ సీటు కోసం దేవెగౌడ కుటుంబంలో పెద్ద రచ్చే సాగింది. అయితే పార్టీ స్వరూప్ ప్రకాష్‌కు టిక్కెట్ ఇచ్చింది. పార్టీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత భవానీ పరివర్తన చెందినట్లు తెలుస్తోంది. స్వరూప్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమె అక్కడే ఉన్నారు.
స్వరూప్‌ను భవానీ మనే మగా (కుటుంబం కుమారుడు) అని సంబోధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో భవానీకి మాస్ అప్పీల్ పెరిగింది. ఆమె రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రచారం చేయాలని డిమాండ్ కూడా వినిపించింది. జిల్లా అధ్యక్షురాలిగా భవాని ఇప్పటికే తన పరిపాలనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అధిష్టానం దేవెగౌడపై ఆమె ప్రభావం ఏపాటిదో జేడీఎస్ వర్గాలకు తెలుసు. నైపుణ్యం, పట్టుదలతో పాటు ఇతర అంశాలు కూడా భవానిని జేడీఎస్‌లో కీలక నేతగా మారుస్తున్నాయి. అయితే అదంతా ప్రజాస్వామిక ఆశయంగా ఎలా మారుతుందనేది 2024 లోక్‌సభ ఎన్నికల్లో చూడొచ్చు.
రూ. 2000 కోట్లు ఎక్కడ ఉన్నాయి?
రాజస్తాన్‌లో ప్రతిపాదిత కొత్త జిల్లాల అభివృద్ధికి హామీ ఇచ్చిన మొత్తం అది. అయితే రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు వారి సొంత జిల్లా ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ.. ఆ హామీని ఎవరూ గుర్తించడం లేదు. దీనిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా మౌనంగా ఉన్నారు. అయితే ఈ ప్రశ్నకు భయపడి పలువురు మంత్రులు బహిరంగ సభలకు హాజరుకావడం మానేసినట్లు సమాచారం.
అయితే ఈ జిల్లాల విభజనకు ఇప్పటి వరకు లైన్ కూడా వేయలేదని ప్రభుత్వంలోని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గ్రౌండ్‌లో కొంత చర్య కనిపించే వరకు అశోక్ గెహ్లాట్, అతని సహచరులు నిద్రాణస్థితిలోకి వెళ్లవలసి ఉంటుంది.
యూనిఫారంలో దోపిడి..
రాజస్థాన్‌లోని జైలు ఖైదీలు ఆ ప్రాంగణంలో కూరగాయల తోటను పెంచారు. ఈ తోటలోని సేంద్రీయ ఉత్పత్తులు.. జైలులోని ఖైదీలను అటువంటి చర్యలో నిమగ్నం చేయాలని నిర్ణయించుకున్న జైలు అధికారి కథను వివరిస్తాయి. కానీ ఆయన స్థానంలో వచ్చిన కొత్త అధికారి ఆలోచనలు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. ఆయన తన కుటుంబానికి పురుగుమందులు లేని కూరగాయలను అందించాలనే ఉద్దేశ్యంతో పంటను ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించాడు.
మరోవైపు జైలు తోటలోని కూరగాయలు అగ్రశ్రేణి అధికారుల ఇళ్లకు క్రమం తప్పకుండా చేరుకుంటాయని కూడా చెబుతున్నారు. అయితే దోపిడిని చూసి జైలులోని ఖైదీలు.. ‘ఆకాశ పక్షులను చూడండి.. అవి విత్తవు కోయవు.. తండ్రి వాటికి ఆహారం ఇస్తాడు’ అనే బైబిల్ వ్యాఖ్యాన్ని జపించినందుకు వారిని నిందించలేం.
