దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..  

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

క్యాపిటలిస్ట్ కామ్రేడ్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేపట్టబోయే అమెరికా పర్యటన వివాదంలో చిక్కుకుంది. ఎందుకంటే.. యూఎస్ టూర్ సందర్భంగా పినరాయి విజయన్ పాల్గొనే ఈవెంట్‌లో ఆయనకు దగ్గరగా కూర్చోవడానికి లక్ష డాలర్లు వసూలు చేస్తున్నారని వినికిడి. అయితే దీనిని గోల్డ్ కార్డుగా పేర్కొంటుడగా.. ఈవెంట్‌కు హాజరయ్యే వారికి సిల్వర్(50 వేల డాలర్లు), కాంస్యం( 25 వేల డాలర్లు) ఎంపికలు కూడా ఉన్నాయి. విజయన్ ప్రసంగించబోయే పబ్లిక్ ఈవెంట్‌కు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి భారీ స్పాన్సర్‌షిప్‌లను సేకరించే ఈ చర్యను సమర్థించుకోవడానికి కేరళలోని ఆయన సహచరులు ఒక రుచికరమైన సాకుతో కలిసి ముందుకు వస్తున్నారు. 

రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు, ప్రవాస కేరళీయుల వ్యవహారాల శాఖ (నార్కా) నిధుల సమీకరణ ఆరోపణలను ఖండించాయి. అయితే అమెరికా సమాజంలో ఇలాంటి నిధుల సేకరణ విందులు లేదా సంఘటనలు సర్వసాధారణం అయితే.. ఈ గాలా వ్యవహారంలో ప్రతి నిమిషం సోషలిస్టు, శ్రామికవర్గ సూత్రాలపై ప్రమాణం చేసే కమ్యూనిస్ట్ నాయకుడే భాగం కావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వెంట మంత్రివర్గంలోని కొందరు సహచరులు కూడా అమెరికాకు వెళ్లనున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు స్పాన్సర్ల జాబితా బయటకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇక, అతిపెద్ద హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే.. విజయన్ తన అమెరికా పర్యటనతో పాటు క్యూబా పర్యటనను కూడా జాబితా చేశారు. క్యూబాలో విజయన్, ఆయన బృందం.. ప్రజారోగ్య రంగంతో పాటు ఇతర విషయాల గురించి అధ్యయనం చేస్తుంది. నిజానికి ఇది..పెట్టుబడిదారీ విధానం, సోషలిజం మధ్య దృఢమైన ద్వంద్వత్వం.

యథా రాజా...
ప్రజలు తమ రాజును(పాలకుడిని) శ్రద్ధగా అనుసరించాలి. కేరళలోని ఈ లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఈ వ్యాఖ్యాన్ని సరిగ్గా గ్రహించాడు. అతను ఇటీవల రూ. 50 లక్షల మినీ కూపర్‌ కారును డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన ‘‘కీ’’లు అప్పగించిన ఫొటో వైరల్‌గా కావడం.. సీపీఎం, దాని ట్రేడ్ యూనియన్ సీఐటీయూను ఇబ్బంది పెట్టే విధంగా మారింది.

విలాసవంతమైన కారును తన భార్య బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిందని ఆ నాయకుడు పేర్కొన్నారు. అయితే ఆ పేద నాయకుడి భార్య రూ. 50 లక్షల మినీ కూపర్‌ని ఎందుకు కొనుగోలు చేశారనే దానిపై ట్రోలింగ్ సాగుతుంది. ఇది పార్టీ క్యాడర్‌ను వెంటాడుతుంది. ఆసక్తికరంగా.. కొత్త కారు ఆ నేత గ్యారేజీలో పార్క్ చేసిన లగ్జరీ కార్ల సముదాయంలో చేరనుంది. ఆ నాయకుడు ఇటీవల తన గ్యారేజీని విస్తరించేందుకు పక్కనే ఉన్న ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు కూడా చెబుతున్నారు.

హాస్యాస్పదంగా.. అయితే పార్టీ అధికారికంగా ఆ నేతను వివరణ కోరలేదు. మొదటి రాయి వేయడానికి ‘‘పాపం’’ చేయని ఒక సహచరుడి కోసం పార్టీ అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉండవచ్చు.


ఆధిపత్యం కోసం రాణి యత్నం.. 
తెలంగాణలో తన ఉనికిని చాటడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న ప్రయత్నాలు చాలా ధ్రుడంగా, స్పష్టంగా ఉన్నాయి. షర్మిల ప్రయత్నాలు.. ఆమె ఇటీవల ఒక పోలీసు అధికారిపై చేయి చేసుకున్న మాదిరిగానే ఉన్నాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను వైఎస్ షర్మిల ఇటీవల కలవడం పలు రకాల చర్చలకు దారితీసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిపై షర్మిల కన్ను పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా సిట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలనే వంటి క్షణికావేశాల నిర్ణయాల వెనుక ఈ ఆశయం దాగి ఉందని పలువురు భావిస్తున్నారు. తెలంగాణలో ఆమెను పవర్ సెంటర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నప్పటికీ.. అందుకు ఇంకా సమయం రాలేదని ఏఐసీసీ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది.

షర్మిల తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వదిలిపెట్టిన చిత్తశుద్ధితో ఆమె తెలంగాణలో పార్టీని నిర్మించాలని కాంగ్రెస్‌ కోరుతోందనే ప్రచారం సాగుతూనే ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? అనేది రాజకీయ చర్చనీయాంశంగా మిగిలిపోయింది.

సాహిబ్ బీబీ ఔర్ గులాం
రాజస్థాన్‌లో ఇద్దరు ప్రభుత్వోద్యోగుల మధ్య ప్రేమ వివాహం జరిగింది. అయితే ఐపీఎస్ అధికారి అయిన భార్య.. ఐఎఫ్ఎస్ అధికారి అయిన తన భర్తకు విడాకుల నోటీసులు అందజేసినట్లు సమాచారం. అయితే ఈ పరిణామం.. వారిని ఆదర్శవంతమైన బ్యూరోక్రాటిక్ జంటగా భావించే వారి బ్యాచ్ మేట్‌లను షాక్‌కు గురి చేసింది. వేర్వేరు జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చినా వారికి పలు సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఐపీఎస్ అధికారి అయిన మహిళను ఆమె శక్తివంతమైన వ్యక్తిత్వంతో తరచుగా దబాంగ్ అధికారి అని పిలుస్తారు. 

అయితే ఆ ఐఎఫ్‌ఎస్ అధికారిపై సౌమునిగా, కో ఆపరేటివ్ వ్యక్తిగా ముద్ర ఉంది. అయితే భర్తకు విడిపోవడం ఇష్టం లేకపోయినా.. భార్య మాత్రం ఇప్పటివరకు జరిగింది చాలని స్పష్టంగా చెప్పింది. ఈ విషయం ఇప్పుడు బహిరంగంగా మారింది. అయితే పవర్ జంట విడిపోవాలని నిర్ణయించుకోవడానికి అసలు కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది.