Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్: కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, బీసీసీఐకి అక్కడేం పని, రాజకీయాలు అంటే అంతేనా..!

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో మీ ముందుకు తీసుకోస్తోంది. మరి రెండో ఎపిసోడ్‌లో విశేషాలు ఇవే.. 
 

from the india gate Cabinet reshuffle BCCI at Qatar for the FIFA WC and no permanent foes
Author
First Published Dec 21, 2022, 8:58 PM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పక్షాల వ్యుహాలను రీడర్స్‌కు అందించే ప్రయత్నం చేస్తోంది. ఫ్రమ్ ది ఇండియా గేట్ రెండో ఎపిసోడ్‌‌లో కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ, యువరాజుకు రాచబాట, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే.. విశేషాలను అందిస్తోంది. 

మార్పులు తప్పవా..!
పార్లమెంట్ సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కంటే ఒక వారం ముందుగానే.. అంటే ఈ వారంతంలోనే ముగియనున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందంటూ చర్చలు నడుస్తున్నాయి. ఇద్దరు పెద్దలను కేబినెట్‌ నుంచి తొలగించవచ్చని అంటున్నారు.. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విఫలమైనందుకు ఒక పెద్ద వ్యక్తిని కేబినెట్‌ నుంచి బయటకు పంపే అవకాశం ఉందని అంటున్నారు.

క్రేజీగా ఉంది కదా..
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సంగ్రామంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య హోరాహోరిగా పోరు సాగింది. చివరకు అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ప్రపంచంలోని సాకర్ అభిమానులు ఈ పోరును ఎంతో ఆసక్తిగా తిలకించారు. అయితే ఈమ మ్యాచ్‌ను వీక్షించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులు కూడా ఖతార్‌లో దోహాకు వెళ్లారు. అయితే వీరు కేవలం మ్యాచ్‌‌ను తిలకించేందుకు మాత్రమే అక్కడికి వెళ్లలేదు. వారు అక్కడికి వెళ్లడం వెనక వేరే కారణాలున్నాయనే మాట వినిపిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ధనిక క్రీడా సంస్థలలో బీసీసీఐ ఒకటిగా ఉంది. 

అయితే ఫిఫా వరల్డ్ కప్ వంటి ప్రపంచ స్థాయి ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణ ఎలా జరుగుతుందో స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకోవడంతోనే బీసీసీఐ ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఎలా హ్యాండిల్ చేస్తారు?, ఇంతటి భారీ ఈవెంట్‌లకు హాజరయ్యే దేశాధినేతలు ఎలా హ్యాండిల్ చేస్తారు?.. అనే అంశాలపై బీసీసీఐ బృందం అధ్యయనం చేసింది. అలాగే గేమ్‌కు ముందు.. ఈవెంట్‌ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుందో, ఈవెంట్‌కు అవసరమైన సౌకర్యాలను ఎలా సమకూరుస్తారో తెలుసుకోవడానికి వారు సమయం కేటాయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది సరైనా కారణమనే మీకు అనిపిస్తుందా? వీరు నమ్ముతున్నారా?.. లేకపోతే థర్డ్ అంపైర్‌కి వదిలేస్తారా?

తమిళనాడు కోటలో యువరాజుకు రాచబాట.. 
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన కొడుకు ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రివర్గంలోకి తీసుకనున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రోటోకాల్‌లో అతని ర్యాంక్ చాలా మంది అనుభవజ్ఞుల కంటే ముందు ఉంచారు. అంతేకాకుండా కొడుకుకు మరిన్ని బాధ్యతలను అప్పగించాలని స్టాలిన్ భావిస్తున్నారు. ఈ మేరకు డీఎంకే వర్గాల్లో భారీగా ప్రచారం సాగుతుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి నేతృత్వం వహించేవిధంగా ఉదయనిధిని ప్రదర్శించేందుకే స్టాలిన్ ‌ఈ ఎత్తుగడలు వేస్తున్నారని అంతా భావిస్తున్నారు. 

త్వరలో తన కొడుకు ఉప ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో కూడా స్టాలిన్ ఉన్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. యువరాజు(ఉధయనిధి) పవర్ సెంటర్‌గా మారుతున్నట్లు తగినంత సంకేతాలను పంపిస్తున్నారు. ఇందుకు ఇటీవల చోటుచేసుకున్న ఓ పరిణామాన్ని కొందరు ఉదరహరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పాల ధరలు, విద్యుత్ ఛార్జీలను పెంచాలని కోరారు. అయితే ఆ సిఫార్సును సీఎం స్టాలిన్ అంగీకరించక పోయినప్పటికీ.. యువరాజు ఆమోదం పొందడంతో ప్రభుత్వం ముందుకు సాగింది.

శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. 
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది మాట సత్యమనేది పలు ఘటనలు రుజువు చేశాయి. తాజాగా తెలంగాణలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూడా మరోసారి ఈ మాటనే నిజం చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. తన రాజకీయ ఆశయాలకు రెక్కలు తొడిగిన కేసీఆర్.. బీఆర్ఎస్‌తో దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావిస్తున్నారు. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్‌‌‌ విస్తరణకు వ్యుహాలను రచిస్తూనే.. మరో తెలుగు రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. 

ఈ క్రమంలోనే కేసీఆర్‌ పార్టీ వైపు ఎవరూ మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా‌లు వేసే పనిలో పడ్డారు. అయితే రెండుసార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ నుంచి బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించినవారిలో ఉండవల్లి అరుణ్‌కుమార్ మొదటి వరుసలో ఉంటారు. ఆయనకు కేసీఆర్ వ్యతిరేకిగా  కూడా పేరుంది. 

అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. తాజాగా కేసీఆర్‌తో ఉండవల్లి సుదీర్ఘంగా భేటీ అయ్యారని రెండు తెలుగు రాష్ట్రాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉంది. ఇలాంటి నేపథ్యం ఉన్న ఉండవల్లి ఒకవేళ బీఆర్ఎస్‌కు మద్దతుగా ఉంటే.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అని మరోసారి నిరూపితమైనట్టే. 

Follow Us:
Download App:
  • android
  • ios