Asianet News TeluguAsianet News Telugu

దేశంలో మ‌హిళ‌ల‌కు రక్షణేది? అంకిత హ‌త్య నుంచి ల‌ఖింపూర్ కేసుల వ‌ర‌కు..

Crimes: దేశంలో మ‌హిళ‌ల‌పై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌ల‌తో స్థానికంగా ప్ర‌జ‌లు భయాందోళ‌న‌లు వ్య‌క్తమవుతున్నాయి. అంకిత హత్య కేసు నుంచి లఖింపూర్, బదౌన్ కేసుల వరకు.. గత నెలలో బాలికలపై ఈ నేరాలు ప్రభుత్వం, పరిపాలన యంత్రాంగం మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో విఫలమవుతున్నాయన‌డానికి నిద‌ర్శ‌నంగా ఉన్నాయి. 
 

From Ankita's murder to Lakhimpur cases.. Increasing crimes against women
Author
First Published Sep 25, 2022, 4:36 PM IST

Crimes against women: దేశంలో మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఏదోఒక చోట మ‌హిళ‌ల‌పై లైంగిక‌దాడులు, అత్యాచారాలు, హత్యలు, దాడులు, ఇత‌రు నేరాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన నేరాలు చూస్తే.. మొదట లఖింపూర్, తర్వాత బదౌన్.. ఇప్పుడు అంకిత హత్య కేసు దేశంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌పై అనేక‌ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ మూడు కేసుల్లోనూ బాలికలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, పరిపాలన ముఖ్యంగా పేద‌లు ర‌క్ష‌ణ అందించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయ‌న‌డానికి నిద‌ర్శ‌నంగా ఈ ఘ‌ట‌న‌లు నిలుస్తున్నాయి. 

అంకిత హత్య కేసు 

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోని ఓ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న అంకిత (19) హత్యకు గురైంది. ప్రాథమిక నివేదికలో, అంకిత మరణం నీటిలో మునిగిపోవడం వల్ల జరిగిందనీ, శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని కూడా పేర్కొంది. అయితే,  అంకిత ఎలా గాయ‌ప‌డింద‌నే విష‌యంలో క్లారిటీ రాలేదు. అంకిత పని చేసే రిసార్ట్ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకి చెందినది. పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తా అనే ఉద్యోగి అంకితను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో లైంగిక వేధింపుల కోణం కూడా ఉంది. 

అంకిత స్నేహితురాలు మీడియాతో కొన్ని చాట్‌లను పంచుకుంది. అంకిత తన స్నేహితుడికి చాట్ ద్వారా తన కష్టాలను చెప్పింది. చాట్ ప్రకారం.. VIP అతిథికి స్పా సర్వీస్ అందించమని అంకితపై ఒత్తిడి వచ్చింది. అంకితను వ్యభిచారిణిగా చేస్తానని 10 వేల రూపాయలు ఎర చూపారు. అంతేకాదు, గెస్ట్‌ని హ్యాండిల్ చేయకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానని అంకితను బెదిరించారు. ఓ రోజు రిసార్ట్‌లో ఓ బాగా మ‌ద్యం సేవించిన ఉన్న ఓ వ్య‌క్తి అంకిత మెడకు బలవంతంగా అదిమిప‌ట్టాడు. అంకిత గతంలో రిసార్ట్‌లో అరుస్తూ కనిపించింది.

బదౌన్‌లో దళిత బాలిక మృతదేహం లభ్యం

బుదౌన్ జిల్లాలోని ఫైజ్‌గంజ్‌లోని బెహతా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దళిత మైనర్ బాలిక  మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహాన్ని రైల్వే స్టేషన్‌ వెనుక అడవిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలిక కుటుంబ సభ్యులు అత్యాచారం తర్వాత హత్య చేశారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన మృతుడి తల్లి తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసు పోస్టు సిబ్బంది, బ్యాంకు బయట విధులు నిర్వహిస్తున్న గార్డులు అందరూ భాగస్వాములయ్యార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

లఖింపూర్‌లో అత్యాచారం, హత్య కేసు

యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు లభ్యం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ కేసులో కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి తమ కూతుళ్లను బలవంతంగా తీసుకెళ్లారని బాధితురాలి తల్లి  తెలిపారు. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికలిద్దరూ తొలుత అత్యాచారానికి గుర‌య్యార‌నీ, అనంతరం గొంతుకోసి హత్య చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఎన్సీఆర్బీ నివేదిక‌

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం.. రాజస్థాన్ 2021 సంవత్సరంలో దేశంలో అత్యధిక రేప్ కేసులను నమోదు చేసింది. మునుపటి సంవత్సరం (2020)తో పోలిస్తే వాటి సంఖ్య 19 శాతం ఎక్కువ పెరిగింది. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం, మహిళలపై మొత్తం నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొద‌టి స్థానంలో ఉండ‌గా,  ఆ తర్వాత రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంది. అదే సమయంలో రేప్ కేసులలో దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.2021లో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి 4,28,278 కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. ఇందులో 56,083 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, 40,738 కేసులతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. గతేడాది మహిళలపై జరిగిన నేరాల్లో 39,526 కేసులతో మహారాష్ట్ర మూడో స్థానంలో, 35,884 కేసులతో పశ్చిమ బెంగాల్ నాలుగో స్థానంలో నిలిచాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios