లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల్లో పెళ్లి అనగా యువకుడిని అతని మిత్రులు అడవిలోకి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అతని మర్మాంగాన్ని కోసేసి పారిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్ పాట్ జిల్లాలో చోటు చేసుకుంది. 

వరుడు అంతకు ముందు ఇద్దరి వద్ద డబ్బులు అప్పు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వలేదు. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు వరుడిని అడవిలోకి ఎత్తుకెళ్లారు. అతని మర్మాంగాన్ని కోసేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.

దాంతో ఏం చేయాలో తెలియక వరుడు ఆందోళనకు గురయ్యాడు. కింద పడిన తన మర్మాంగాన్ని తీసుకుని వెనుదిరిగాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత స్థానికులకు విషయం తెలిసిందే. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసారు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేశారు.

ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతన్ని పెద్ద ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని వైద్యులు సూచించారు. బాధితుడు సమీర్ బాగ్ పాట్ జిల్లాలోని ఈద్దా మొహల్లాకు చెందినవాడు. కరోనా సమయంలో మిత్రుల వద్ద సమీర్ అప్పు చేశాడు. తిరిగి ఇవ్వలేదు. పెళ్లి సమయంలోనైనా ఇవ్వాలని అడిగితే కూడా ఇవ్వలేదు. దీంతో మిత్రులు ఆ ఘాతుకానికి పాల్పడ్డారు.