నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Friday 9th September Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

8:06 PM IST

లోన్ యాప్‌లపై కేంద్రం కన్నెర్ర

లోన్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఈ మేరకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ యాప్‌లను స్టోర్స్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. 

7:10 PM IST

ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తి

ఖైరతాబాద్ గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేశారు. గణేశుడికి వీడ్కోలు పలికేందుకు జంట నగరాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. 

6:38 PM IST

లోన్‌ యాప్ విషయంలో అప్రమత్తంగా వుండండి

లోన్ యాప్‌ల విషయంలో అప్రమత్తంగా వుండాలని సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం, పోలీసులు సైతం ఇటువంటి యాప్‌లపై ప్రజల్లో అవగాహణ కల్పించాలని ఆయన కోరారు. బాధితులకు అండగా వుండాలని చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 
5:52 PM IST

ఖరీఫ్‌లో తగ్గనున్న బియ్యం ఉత్పత్తి

ఈ ఏడాది ఖరీఫ్‌లో బియ్యం ఉత్పత్తి తగ్గనుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం తెలిపింది. దాదాపు 10 నుంచి 12 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. వరి సాగు విస్తీర్ణం తగ్గడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. 

4:03 PM IST

నుపుర్ శర్మకు ఊరట... అరెస్ట్ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం కోర్ట్

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన బిజెపి బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించడానికి సుప్రీం కోర్టు అనుమతించలేదు. వెంటనే ఆ పిటిషన్  ను వెనక్కి తీసుకోవాలని సుప్రీం కోర్ట్ చీఫ్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.  

3:17 PM IST

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనంలోనూ ప్లెక్సీ వివాదం...

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు సాయికిరణ్ యాదవ్ ప్లెక్సీలు వివాదానికి దారితీసాయి. ఈ ప్లెక్సీల ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తంచేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో మంత్రి అనుచరులు, ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. 

1:26 PM IST

మూడు రాజధానుల నిర్ణయమే ఫైనల్... త్వరలో నూతన బిల్లు: మంత్రి అమర్నాథ్

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల నిర్ణయానికే వైసిపి ప్రభుత్వం కట్టుబడి వుందని... వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించి నూతన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం వుందన్నారు. అమరావతి దేవతల రాజధాని కాదు దెయ్యాల రాజధాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 
 
12:52 PM IST

''ఆర్సీ 15'' లో ఎస్ జె సూర్య... రామ్ చరణ్ కీలక ప్రకటన

దర్శకుడిగానే కాదు యాక్టర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎస్ జె సూర్య తన తదుపరి సినిమాలో నటించబోతున్నాడని హీరో రామ్ చరణ్ తేజ్ ప్రకటించారు. శంకర్ దర్శకత్వంతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ''ఆర్సి 15'' యూనిట్  లో సూర్య చేరాడంటూ రామ్ చరణ్ ప్రకటించారు. 

11:48 AM IST

ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ దిశగా కదులుతున్నారు. పంచముఖ మహాలక్ష్మి రూపంలోని బొజ్జగణపయ్య శోభాయాత్ర ప్రారంభమయ్యింది.   
 
10:52 AM IST

ఆల్ టైమ్ రికార్డ్... రూ.24.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

బాలాపూర్ గణేషుడి చేతిలో నవరాత్రుల పూజలందుకున్న లడ్డూ ప్రసాదం రికార్డు ధర పలికింది. వేలంపాటలో ఏకంగా రూ.24.60 లక్షలతో గణపయ్య లడ్డూను  లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది ఇదే బాలాపూర్ లడ్డు ధర రూ.18.90 లక్షలు పలకిన విషయం తెలిసిందే. 

10:16 AM IST

అమరావతి రైతుల పాదయాత్రకు నో పర్మిషన్... పోలీస్ శాఖ కీలక ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు మరోసారి పాదయాత్రకు సిద్దమవగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల(సెప్టెంబర్) 12న అమరావతి నుండి అరసవెల్లికి పాదయాత్ర చేపట్టాలని రాజధాని రైతులు నిర్ణయించి పోలీసుల అనుమతి కోరారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ ఈ పాదయాత్రకు డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతి నిరాకరించారు. 

9:36 AM IST

మరోసారి చరిత్ర సృష్టించిన ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా

ఒలింపిక్స్ లో స్వర్ణ పతకంలో విదేశీ గడ్డపై భారత కీర్తిని మరింత పెంచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి మెరిసాడు. మరోసారి అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన నీరజ్ ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఈ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడు నీరజ్ కావడం విశేషం. 88.44 మీటర్ల దూరం జావెలిన్ విసిరి నీరజ్ టైటిల్ విజేతగా నిలిచాడు.
 
9:28 AM IST

బిఅలర్డ్... తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు

తెలంగాణలో నేడు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే గత రెండురోజులుగా రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా నేడు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

8:06 PM IST:

లోన్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఈ మేరకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ యాప్‌లను స్టోర్స్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. 

7:10 PM IST:

ఖైరతాబాద్ గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేశారు. గణేశుడికి వీడ్కోలు పలికేందుకు జంట నగరాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. 

6:38 PM IST:

లోన్ యాప్‌ల విషయంలో అప్రమత్తంగా వుండాలని సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం, పోలీసులు సైతం ఇటువంటి యాప్‌లపై ప్రజల్లో అవగాహణ కల్పించాలని ఆయన కోరారు. బాధితులకు అండగా వుండాలని చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 
5:52 PM IST:

ఈ ఏడాది ఖరీఫ్‌లో బియ్యం ఉత్పత్తి తగ్గనుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం తెలిపింది. దాదాపు 10 నుంచి 12 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. వరి సాగు విస్తీర్ణం తగ్గడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. 

4:03 PM IST:

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన బిజెపి బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించడానికి సుప్రీం కోర్టు అనుమతించలేదు. వెంటనే ఆ పిటిషన్  ను వెనక్కి తీసుకోవాలని సుప్రీం కోర్ట్ చీఫ్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.  

3:17 PM IST:

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు సాయికిరణ్ యాదవ్ ప్లెక్సీలు వివాదానికి దారితీసాయి. ఈ ప్లెక్సీల ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తంచేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో మంత్రి అనుచరులు, ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. 

1:26 PM IST:

మూడు రాజధానుల నిర్ణయమే ఫైనల్... త్వరలో నూతన బిల్లు: మంత్రి అమర్నాథ్  

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల నిర్ణయానికే వైసిపి ప్రభుత్వం కట్టుబడి వుందని... వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించి నూతన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం వుందన్నారు. అమరావతి దేవతల రాజధాని కాదు దెయ్యాల రాజధాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 
 
12:52 PM IST:

దర్శకుడిగానే కాదు యాక్టర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎస్ జె సూర్య తన తదుపరి సినిమాలో నటించబోతున్నాడని హీరో రామ్ చరణ్ తేజ్ ప్రకటించారు. శంకర్ దర్శకత్వంతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ''ఆర్సి 15'' యూనిట్  లో సూర్య చేరాడంటూ రామ్ చరణ్ ప్రకటించారు. 

11:48 AM IST:

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ దిశగా కదులుతున్నారు. పంచముఖ మహాలక్ష్మి రూపంలోని బొజ్జగణపయ్య శోభాయాత్ర ప్రారంభమయ్యింది.   
 
10:52 AM IST:

బాలాపూర్ గణేషుడి చేతిలో నవరాత్రుల పూజలందుకున్న లడ్డూ ప్రసాదం రికార్డు ధర పలికింది. వేలంపాటలో ఏకంగా రూ.24.60 లక్షలతో గణపయ్య లడ్డూను  లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది ఇదే బాలాపూర్ లడ్డు ధర రూ.18.90 లక్షలు పలకిన విషయం తెలిసిందే. 

10:16 AM IST:

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు మరోసారి పాదయాత్రకు సిద్దమవగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల(సెప్టెంబర్) 12న అమరావతి నుండి అరసవెల్లికి పాదయాత్ర చేపట్టాలని రాజధాని రైతులు నిర్ణయించి పోలీసుల అనుమతి కోరారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ ఈ పాదయాత్రకు డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతి నిరాకరించారు. 

9:36 AM IST:

ఒలింపిక్స్ లో స్వర్ణ పతకంలో విదేశీ గడ్డపై భారత కీర్తిని మరింత పెంచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి మెరిసాడు. మరోసారి అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన నీరజ్ ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఈ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడు నీరజ్ కావడం విశేషం. 88.44 మీటర్ల దూరం జావెలిన్ విసిరి నీరజ్ టైటిల్ విజేతగా నిలిచాడు.
 
9:28 AM IST: