నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Friday 30th September Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:25 PM IST

మరో వివాదంలో భగవంత్ మాన్

ఇటీవల తప్పతాగి విమానం ఎక్కేందుకు ప్రయత్నించి విమర్శల పాలైన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన 42 వాహనాలున్న కాన్వాయ్‌ని ఉపయోగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ భగవంత్ మాన్‌పై విమర్శిస్తున్నాయి. 

8:41 PM IST

హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తామని.. అలాగే ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు వస్తువులు పెడితే భారీ జరిమానా విధిస్తామని తెలిపారు. 

7:42 PM IST

రష్యాలోకి ఉక్రెయిన్ భూభాగాలు

ఉక్రెయిన్‌లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలు ఇకపై తామేవని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ మేరకు జపోర్జియా, ఖేర్సన్, లుహాన్స్క్‌, డోనేట్స్క్ ప్రాంతాలను రష్యా భూభూగంలోకి కలుపుతున్నట్లు పుతిన్ అధికారిక ప్రకటన చేశారు. 

6:54 PM IST

షావోమికి ఈడీ షాక్.. రూ.5,551 కోట్లు జప్తు

చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల దిగ్గజం షావోమీకి ఈడీ భారీ షాకిచ్చింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఈ సంస్థకు చెందిన కార్యాలయాలపై శుక్రవారం దాడులు చేశారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా షావోమీకి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. 

5:59 PM IST

బెంగాల్ స్కూల్ స్కాంలో సీబీఐ ఛార్జీషీట్

వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ స్కాంపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. కోట్ల రూపాయల అక్రమాలపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది సీబీఐ. 

5:07 PM IST

రాజకీయాల్లోకి రాను : నాగార్జున

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ఖండించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని.. విజయవాడ ఎంపీగా పోటీ చేయనని నాగ్ తేల్చిచెప్పారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాగే ప్రచారం చేస్తున్నారని నాగార్జున మండిపడ్డారు. రాజకీయాలకు దూరంగా వున్నానని.. కానీ మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్‌గా నటిస్తానని కింగ్ స్పష్టం చేశారు. 

4:32 PM IST

అమిత్‌షాతో రాజగోపాల్ రెడ్డి భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితిని అమిత్ షాకు వివరించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పరిస్ధితులను అమిత్ షాకు వివరించానన్నారు రాజగోపాల్ రెడ్డి. 

3:46 PM IST

నామినేషన్‌లు వేసిన ఖర్గే, థరూర్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కేంద్ర మాజీ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌లు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పరిస్ధితులు చూస్తుంటే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే అధిష్టానం ఆశీస్సులు మెండుగా వున్న మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం లాంఛనమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. 

3:08 PM IST

బిగ్‌బాస్ నిషేధంపై ఏపీ హైకోర్టు విచారణ

బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే దీనిపై కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 11కు వాయిదా వేసింది. 

12:57 PM IST

మెరుగుపడ్డ రూపాయి విలువ... యూఎస్ డాలర్= రూ. 81.61

చాలారోజులుగా అంతర్జాతీయ స్థాయిలో పతనం అవుతూ వస్తున్న రూపాయి విలువ శుక్రవారం కాస్త మెరుగుపడింది. ఇవాళ 12 పైసలు పుంజుకుని యూఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 81.61 వద్ద నిలిచింది. 

12:04 PM IST

వందేభారత్ ఎక్స్ ప్రెస్, అహ్మదాబాద్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని...

స్వరాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. గాంధీనగర్ టుముంబై మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 1 ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. 

11:38 AM IST

ఈడి విచారణ కోసం న్యూడిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు అందుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి ఈడీ నోటీసులు అందుకోగా విచారణ నిమిత్తం డిల్లీకి వెళ్లారు. 
 
10:45 AM IST

ఎఐసిసి అధ్యక్ష రేసునుండి దిగ్విజయ్ ఔట్... తెరపైకి  మల్లికార్జున ఖర్గే

ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్ష రేసునుండి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుకుంటున్నట్లు సమాచారం. నామినేషన్ కు చివరి రోజయిన ఇవాళ తెరపైకి మల్లికార్జున ఖర్గే వచ్చింది. ఆయన ఇవాళ నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. 

10:42 AM IST

ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంతో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీచేసింది.

10:22 AM IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్... తెరపైకి మరో ఇద్దరు సీనియర్లు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అద్యక్ష రేసు నుండి తప్పుకోగా సీనియర్లు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ మాత్రమే పోటీలో నిలిచారని అందరూ భావించారు. అయితే నామినేషన్లకు చివరిరోజయిన ఇవాళ కొత్తగా మరో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్, మహారాష్ట్ర నేత ముకుల్ వాస్నిక్ కూడా అధ్యక్ష రేసులో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
9:25 PM IST:

ఇటీవల తప్పతాగి విమానం ఎక్కేందుకు ప్రయత్నించి విమర్శల పాలైన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన 42 వాహనాలున్న కాన్వాయ్‌ని ఉపయోగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ భగవంత్ మాన్‌పై విమర్శిస్తున్నాయి. 

8:41 PM IST:

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తామని.. అలాగే ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు వస్తువులు పెడితే భారీ జరిమానా విధిస్తామని తెలిపారు. 

7:42 PM IST:

ఉక్రెయిన్‌లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలు ఇకపై తామేవని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ మేరకు జపోర్జియా, ఖేర్సన్, లుహాన్స్క్‌, డోనేట్స్క్ ప్రాంతాలను రష్యా భూభూగంలోకి కలుపుతున్నట్లు పుతిన్ అధికారిక ప్రకటన చేశారు. 

6:54 PM IST:

చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల దిగ్గజం షావోమీకి ఈడీ భారీ షాకిచ్చింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఈ సంస్థకు చెందిన కార్యాలయాలపై శుక్రవారం దాడులు చేశారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా షావోమీకి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. 

5:59 PM IST:

వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ స్కాంపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. కోట్ల రూపాయల అక్రమాలపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది సీబీఐ. 

5:07 PM IST:

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ఖండించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని.. విజయవాడ ఎంపీగా పోటీ చేయనని నాగ్ తేల్చిచెప్పారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాగే ప్రచారం చేస్తున్నారని నాగార్జున మండిపడ్డారు. రాజకీయాలకు దూరంగా వున్నానని.. కానీ మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్‌గా నటిస్తానని కింగ్ స్పష్టం చేశారు. 

4:32 PM IST:

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితిని అమిత్ షాకు వివరించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పరిస్ధితులను అమిత్ షాకు వివరించానన్నారు రాజగోపాల్ రెడ్డి. 

3:46 PM IST:

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కేంద్ర మాజీ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌లు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పరిస్ధితులు చూస్తుంటే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే అధిష్టానం ఆశీస్సులు మెండుగా వున్న మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం లాంఛనమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. 

3:08 PM IST:

బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే దీనిపై కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 11కు వాయిదా వేసింది. 

12:57 PM IST:

చాలారోజులుగా అంతర్జాతీయ స్థాయిలో పతనం అవుతూ వస్తున్న రూపాయి విలువ శుక్రవారం కాస్త మెరుగుపడింది. ఇవాళ 12 పైసలు పుంజుకుని యూఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 81.61 వద్ద నిలిచింది. 

12:04 PM IST:

స్వరాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. గాంధీనగర్ టుముంబై మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 1 ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. 

11:38 AM IST:

నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు అందుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి ఈడీ నోటీసులు అందుకోగా విచారణ నిమిత్తం డిల్లీకి వెళ్లారు. 
 
10:45 AM IST:

ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్ష రేసునుండి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుకుంటున్నట్లు సమాచారం. నామినేషన్ కు చివరి రోజయిన ఇవాళ తెరపైకి మల్లికార్జున ఖర్గే వచ్చింది. ఆయన ఇవాళ నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. 

10:46 AM IST:

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంతో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీచేసింది.

10:22 AM IST: