ఢిల్లీలోని జహంగిర్‌పురిలో మరోసారి హింస చెలరేగింది. శనివారం నాటి ఘర్షణల్లో కాల్పులు జరిపిన నిందితుడిని పట్టుకోవడానికి వారి ఇంటికి వెళ్లగా.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో నిందితుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సుమారు 50 మంది మహిళలు నిరసనలు చేశారు. ఇళ్లపైకి చేరి పోలీసులపై రాళ్లు విసిరారు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జహంగిర్‌పురిలో హనుమజ్జయంతి సందర్భంగా హింస చెలరేగిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం రెండు మతాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాజాగా, మరోసారి దే ప్రాంతంలో హింసకు తెరలేసింది. సోమవారం ఇక్కడ మళ్లీ వాయిలెన్స్ చెలరేగింది. మళ్లీ ఈ రోజు రాళ్లు రువ్వని ఘటన చోటుచేసుకుంది.
శనివారం నాటి ఘటనలపై దర్యాప్తు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో భాగంగా ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలనుకున్నారు. సోమవారం ఆమెను అదుపులోకి తీసుకోగానే ఆ ప్రాంతంలోని సుమారు 50 మంది మహిళలు నిరసనలు చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు.
శనివారం జరిగిన మత ఘర్షణల్లో ఫైరింగ్ జరిపిన వ్యక్తి సోను అనే నిందితుడి భార్యనే పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోగానే.. మహిళలు కొందరు ఇంటిపై కప్పు మీదకు ఎక్కి పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
పోలీసులు నిజానికి సోనూను వెతుక్కుంటూ వారి ఇంటికి చేరుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నార్త్ వెస్ట్ ఢిల్లీ వివరించారు. కానీ, నిందితుడు సోనూ పరారీలో ఉన్నాడు. ఆయనను సెర్చ్ చేస్తూ వెళ్తుండగానే ఆయన కుటుంబ సభ్యులు రెండు రాళ్లను పోలీసులపైకి విసిరారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఒకరిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.
పోలీసులు ఆ ప్రాంతాన్ని బారికేడ్లతో మోహరించారు. మహిళా సెక్యూరిటీ సిబ్బంది రాళ్లు రువ్విన మహిళలను చెదరగొట్టారు. శనివారం అల్లర్లు జరిగిన ప్రాంతానికి ఒక వంద మీటర్ల దూరంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఇది మైనర్ ఇన్సిడెంట్‌గా పేర్కొన్నారు.
ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లతో దాడి చేశారు. దాంతో హింస చెలరేగింది. వాహనాలను నిప్పు కూడా పెట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు గాయాలయ్యాయి. తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఢిల్లీలో ఘర్షణల నేపథ్యంలో నోయిడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
'అంతర్జాతీయ కుట్ర'
ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జహంగీర్‌పురి ఘర్షణ అంతర్జాతీయ కుట్రలో భాగమని బీజేపీ నేత, వాయువ్య ఢిల్లీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా భారత్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే విదేశీ శక్తుల లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి దేశ అంతర్భాగం లో నుంచే విదేశీ శక్తులకు సాయమందిస్తున్నాయని ఆరోపించారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ కుట్ర జరిగిందనీ, భారత్‌ను అపకీర్తిపాలు చేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు. ఈ ఘటన విషయంలో ఏ మతాన్నీ నిందించలేం. ఈ ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి’ అని పేర్కొన్నారు. కాగా ఎంపీ హన్స్ రాజ్ వాయువ్య ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
