Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి పియానో వాయించిన తండ్రి.. వద్దని వారించిన కూతురితో...

బుధవారం రాత్రి బాగా తాగి పియానో వాయించడం మొదలు పెట్టాడు. అయితే టైం అర్థరాత్రి అయిందని ఈ సమయంలో పియానో వాయించడం వల్ల తనకు, తమ్ముడికి నిద్ర పట్టడం లేదని కూతురు వారించింది.

Freak accident: Drunk ex-techie killed in fight with teen daughter
Author
Hyderabad, First Published Jul 25, 2020, 7:17 AM IST

పియానో వాయించడంతో తండ్రీ, కూతుళ్ల మధ్య తలెత్తిన గొడవ.. చివరకు ఒకరి ప్రాణాన్ని బలిగొన్నది. అర్థరాత్రి తండ్రి పియానో వాయిస్తుంటే.. దాని వల్ల తమకు నిద్రపట్టడం లేదని కూతురు వారించింది. ఈ క్రమంలో జరిగిన గొడవలో తండ్రి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంగటన బెంగళూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరకు చెందిన సప్తక్ బెనర్జీ (46) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తొమ్మది ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. 15 ఏళ్ల తన కూతురు, 9 ఏళ్ల కొడుకుతో బెంగళూరులోని బన్నెరగట్ట రోడ్‌లో ఉండే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఈమధ్యే ఉద్యోగం కూడా మానేశాడు. అనంతరం తాగుడుకు అలవాటు పడ్డాడు.

బుధవారం రాత్రి బాగా తాగి పియానో వాయించడం మొదలు పెట్టాడు. అయితే టైం అర్థరాత్రి అయిందని ఈ సమయంలో పియానో వాయించడం వల్ల తనకు, తమ్ముడికి నిద్ర పట్టడం లేదని కూతురు వారించింది. అయినా కూడా అతడు పియానో వాయిస్తూనే ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత ఆపేయమని కూతురు మళ్లీ అడిగింది. వెంటనే తండ్రీ-కూతుళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

‘‘బెనర్జీ రెండు కత్తెరలు తీసుకుని తన కూతురిని చంపేందుకు ప్రయత్నించాడు. దీన్ని కూతురు ప్రతఘటించింది. అయితే మత్తులో ఉన్న బెనర్జీ కిందపడిపోతున్న క్రమంలో ఆ కత్తెరలు కడుపులో గుచ్చుకున్నాయి. అక్కడికక్కడే బెనర్జీ మృతి చెందాడు. వెంటనే కూతరు తమ బంధువులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు మాకు సమాచారం అందించారు’’ అని సౌత్ ఈస్ట్ డీసీపీ శ్రీనాథ్ మహదేవ్ జోషి తెలిపారు. కాగా బాలికపై ఐపీసీలోని 304 సెక్షన్ ప్రకారం కేసు ఫైల్ చేశామని ఆయన పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios