హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. ఓ నలుగురు యువకులు రైలుతో సెల్ఫీ తీసుకోవాలని ఆశ పడ్డారు. అదెంత ప్రమాదమో గుర్తించలేదు. రైలువ వంతెనపై నిలబడి సెల్ఫీ తీసుకోబోయారు. కానీ ఆ ట్రైన్ కిందే పడి చనిపోయారు...
గురుగ్రాం : సెల్ఫీ సరదా నలుగురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. హర్యానాలోని Gurugramలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన పై మంగళవారం రాత్రి నలుగురు యువకులు Selfie తీసుకుంటుండగా
Train ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న Janshatabdi Express...సెల్ఫీ తీసుకుంటున్న నలుగురు యువకులను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యువకులంతా 18 నుంచి 21 ఏళ్ల వారిని రైల్వే పోలీసులు తెలిపారు.
రైలు సమీపిస్తున్నప్పటికీ యువకులు పక్కకు తప్పుకోకుండా సెల్ఫీ తీసుకోవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వారిలో ఒకరు విద్యార్థి కాగా... మిగిలిన ముగ్గురు యువకులు సెల్ ఫోన్ దుకాణంలో పని చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఘటనలను ప్రమాదాలుగా రైల్వే పరిగణించడం లేదని ఉన్నతాధికారులు తెలిపారు. వారిని అతిక్రమణ దారులుగానే పరిగణిస్తున్నట్లు వివరించారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్లలో గత నెలలో ఆగి ఉన్న goods train పైకెక్కి selfie తీసుకుంటుండగా current shockకి గరై యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ శివారులో జనవరి 27న ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కటికం వీరబ్రహ్మం రైల్వేస్టేషన్ సమీపంలో నివసిస్తున్నాడు. తన బైక్ మీద రైల్వేస్టేషన్ వద్దకు వచ్చాడు. అప్పటికే గూడ్స్ రైలు ఆగి ఉండటంతో వెనుక బోగీపైకి ఎక్కాడు.
బోగీపై నిలబడి సెల్ఫీ దిగేందుకు చేతిని పైకి లేపడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి కింద పడ్డాడు. కిందపడటంతో తలకు గాయం కావడంతోపాటు, శరీరం కూడా తగలబడుతోంది.. ఇది చూసిన అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య గమనించి వెంటనే రైల్వేస్టేషన్ మాస్టర్ కృపాకర్ కు సమాచారం ఇచ్చాడు. రైల్వే ఎస్ఐ ఐలయ్య, ఏఎస్ఐ కె. క్రీస్తుదాసు, కానిస్టేబుల్ సురేష్ లు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. బాధితుడిని 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఇతను చికిత్స తీసుకుంటూ జనవరి 31న మరణించాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు బండిపై సెల్పీ దిగుతూ విద్యుత్ షాక్ కు గురైన కటకం Veerabadrudu మరణించాడు. selfie దిగుతూ వీరభద్రుడు గాయపడ్డారు. వెంటనే అతడిని Guntur ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరభద్రుడు మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్గం తర్వాత వీరభద్రుడి మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరభద్రుడి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని మాచవరం మండలం వేమవరం గ్రామం.
గతంలో కూడా సెల్ఫీ వీడియోల మోజులో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. నదులు, కొండ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లో సెల్పీ మోజులో ప్రమాదానికి గురైన ఘటనలున్నాయి. సెల్పీలు తీసుకొనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. గుంటూరు జిల్లా ఘటనలో కూడా అదే జరిగిందని, అతన్ని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు.
