నాలుగేళ్ల ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొలంలో మృతదేహం కుక్కలు పీక్కుతింటూ....
నాలుగేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఓ మైనర్ బాలుడితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఓ బాలుడితో సహా ఇద్దరిని అరెస్టు చేశారు. బాలిక మృతదేహం ఆమె ఇంటికి సమీపంలోని పొలంలో లభ్యమైంది.
బాధితురాలైన నాలుగేళ్ల బాలిక.. నగరంలోని తన ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమె సమీపంలోని పొలాల్లో మృతదేమంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, తన కుమార్తె బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని తెలిపారు.
దుబాయ్ లాటరీ లక్కీ డ్రాలో రూ. 8కోట్లు గెలుచుకున్న భారతీయుడు..కానీ...
కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి బాలిక కోసం వెతకగా, సమీపంలోని పొలంలో కుక్కల గుంపును గుర్తించి వెళ్లి చూడగా.. బాలిక మృతదేహం కనిపించింది. కుక్కలు బాలిక మృతదేహాన్ని కొరికి ఉన్నట్లు అనుమానించారు.
ఆ బాలిక తప్పిపోయిన తమ కూతురే అని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆ తర్వాత పోలీసులను పిలిచారు. ఈ ఘటనపై పోలీసు అధికారి వ్యాఖ్యానిస్తూ, కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ పరిశోధనలు పూర్తయిన తర్వాత అత్యాచారం జరిగినట్లు నిర్ధారించబడిందని తెలిపారు.
ఇదిలా ఉండగా మైనర్ కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడిని పోలీసులు విచారించగా నేరం అంగీకరించాడు. బాలిక పొలంలో తిరుగుతుండడం తాను చూశానని, అక్కడి నుంచి మైనర్ సహచరుడితో కలిసి మరో పొలానికి తీసుకెళ్లి అత్యాచారం చేశానని నిందితుడు చెప్పాడు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు.