కరోనా కల్లోలం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పడు కొత్త స్ట్రెయిన్ ప్రపంచదేశాల్ని కలవర పెడుతోంది. ఇప్పటికే దేశంలో 25మంది దీని బారిన పడినట్టుగా అధికారులు ప్రకటించగా తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో నలుగురికి కొత్త స్ట్రెయిన్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 

ఈ మేరకు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ నిర్థారణ చేశారు. ఇప్పటికే విమాన ప్రయాణాలపై నిషేధం విధించినట్లు ఆయన గుర్తుచేశారు. గత కొద్ది రోజులుగా యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన వారిని ట్రేసింగ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. 

ఇదిలా ఉండగా.. భారత్‌లో గురువారం కొత్తగా మరో ఐదు స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. భారత్‌లో మొత్తం స్ట్రెయిన్ కేసుల సంఖ్య 25కు చేరింది. 

కరోనాతో పోల్చుకుంటే 70 శాతం వేగంగా స్ట్రెయిన్ వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు తేలడంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌కు రాకపోకలపై చాలా దేశాలు నిషేధాన్ని విధించాయి. అప్పటికే స్వదేశాలు చేరుకున్న వారికి కరోనా పరీక్షలు చేసి పాజిటివ్‌గా తేలితే వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు.