ముంబై: ముంబైలో నాలుగంతస్తుల భవనం మంగళవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో  ఇద్దరు మృతి.చెందగా, మరో 40 మందికి పైగా శిథిలాల కింద పలువురు చిక్కుకొన్నారు.ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు..ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ భవనం కింద పలువురు చిక్కుకొన్నట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు.విషయం తెలిసిన వెంటనే పలు శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.  మంగళవారం ఉదయం 11:40 గంటలకు ఈ భవనం కుప్పకూలినట్టుగా ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. 

ముంబై డోంగ్రిలోని అబ్దుల్ రహమాన్ షా  దర్గా సమీపంలో ఈ భవనం ఉన్నట్టుగా  పోలీసులు చెబుతున్నారు.  శిథిలాల కింద సుమారు 50 మంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.