Asianet News TeluguAsianet News Telugu

మణిపూర్ లో ఆగని హింస: 48 గంటల్లో ఏడుగురు మృతి

మణిపూర్ రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.  గత ఏడాది మే నుండి ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

 Four shot dead in Manipur's Bishnupur as ethnic violence continues in state lns
Author
First Published Jan 19, 2024, 12:47 PM IST | Last Updated Jan 19, 2024, 12:47 PM IST

న్యూఢిల్లీ: మణిపూర్ లోని బిష్ణపూర్ జిల్లాలో  గురువారం నాడు సాయంత్రం నలుగురిని కాల్చి చంపినట్టుగా పోలీసులు ప్రకటించారు.   పోలీసుల కథనం ప్రకారంగా  నింగ్‌తౌఖోంంగ్ ఖా ఖునౌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.  

వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో ఆరుగురు సాయుధ దుండగులు కాల్పులకు దిగారు.  దీంతో  ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నుండి  ఒకరు తప్పించుకున్నారు. దుండగులు  కొండల వైపునకు పారిపోయినట్టుగా  ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు  చెప్పారు.మణిపూర్ లో ఇద్దరు పోలీస్ కమాండో‌లను కాల్చి చంపిన  కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
48 గంటల్లోనే ఏడుగురు మృతి

గత 48 గంటల్లోనే  ఏడుగురు మృతి చెందారు.  బుధవారం నాటి నుండి  ప్రత్యేక జిల్లాల్లో ఇద్దరు పోలీస్ కమాండోలతో సహా కనీసం ఏడుగురు మరణించారు.  బుధవారంనాడు మయన్మార్  సరిహద్దుకు  సమీపంలోని వ్యాపార పట్టణమైన మోరేలో  హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  మణిపూర్ పోలీస్ కమాండోలు సాయుధ మూకల దాడిలో మృతి చెందారు. మృతులను ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లామ్‌షాంగ్ కు చెందిన వాంగ్ ఖేమ్  సోమోర్జిత్  , తఖెల్లంబ్ శైలేశ్వర్ గా గుర్తించినట్టుగా  పోలీసులు తెలిపారు.

గురువారం నాడు ఇమా కొండొంగ్  లైరెంబి దేవి ఆలయం సమీపంలో జరిగిన ఆకస్మిక దాడిలో సోమోర్జిత్ కు బుల్లెట్లు తగిలాయి.  అస్సాం  రైఫిల్స్ కు చెందిన  అతనికి బుల్లెట్ గాయాలయ్యాయి. అతను  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందారు. బుధవారం నాడు  శైలేశ్వర్ ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్టుగా అధికారులు తెలిపారు.

ఎడమ కాలికి బుల్లెట్ తగిలిన కానిస్టేబుల్ ఎన్.భీమ్ కు ముఖం, చెవులకు గాయాలయ్యాయి.  ఎఎస్ఐ  సిద్దార్ద్  తోక్‌చోమ్   మోరే నుండి విమానంలో  ఇంఫాల్ ఆసుపత్రికి తరలించారు. ఇంఫాల్ లో రిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు.

2023 మే నుండి మణిపూర్ లో  గిరిజన తెగల మధ్య  ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.ఈ ఘర్షణలు హింసాత్మకంగా  మారాయి. మణిపూర్ లో  ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో  207 మంది ప్రాణాలు కోల్పోయారు.  సుమారు  50 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.  

తరచుగా  రెండు గ్రూపులకు చెందిన మిలిటెంట్లు  పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తౌబాల్ లోని భద్రతా బలగాలు, పోలీస్ వ్యవస్థాపనలపై గుంపు దాడి చేసింది. ముగ్గురు బీఎస్ఎఫ్ సిబ్బందికి బుల్లెట్ గాయాలు తగిలాయి.  తౌబల్ జిల్లాలోని ఖంగాబోక్‌లోని మూడవ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్  ను సాయుధ దుండగులు  దాడికి దిగారు.అయితే  భద్రతా బలగాలు సాయుధ దుండగుల దాడిని తిప్పికొట్టారని  మణిపూర్ పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించాయి. 

తౌబాల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను ఉల్లంఘించేందుకు మూక గుంపు దాడి చేసిందని పోలీసులు ప్రకటించారు. అంతేకాదు  గుంపులో నుండి కాల్పులకు దిగినట్టుగా పోలీసులు వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios