బెంగళూరు: ప్రేమ పెళ్లి వ్యవహారం నలుగురి నిండు ప్రాణాలను బలితీసుకున్న దారుణ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి అత్యంత పాశవికంగా ఈ హత్యలకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు  కూడా వున్నారు. 

ఈ హత్యలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని  రాయచూర్ జిల్లా సింధునూరు కు చెందిన యువతీ, యువకులు ప్రేమించుకుని కుటుంబసభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  

read more  కూతుళ్లపై కొన్నేళ్లుగా భర్త అత్యాచారం, భార్య మద్దతు: కూతుళ్లను కొట్టి....

ఈ క్రమంలో యువకుడి కుటుంబసభ్యులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు.  సావిత్రమ్మ(55), శ్రీదేవి(38), హనుమేశ్(35), నాగరాజు(33) అనే నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఇది కూడా యువతి బంధువుల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్ లను రప్పించి ఆదారాలను సేకరించారు. ఈ హత్యకు పాల్పడిని నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.