థానే: మహారాష్ట్రలోని మరో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని థానేలో గల ప్రైమ్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు రోగులు సజీవదహనమయ్యారు.

బుధవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో ఆ ప్రమాదం సంభవించింది. మంటలను ఫైర్ ఇంజన్లు అదుపు చేశాయి. మూడు ఫైర్ ఇంజన్లు, ఐదు అంబులెన్స్ లు రంగంలోకి దిగాయి. 

ఆస్పత్రి నుంచి 20 మంది రోగులు సురక్షితంగా తరలించారు వారిలో ఆరుగురు ఐసియులో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదంలో ఆస్పత్రి మొదటి అంతస్థు మొత్తం ధ్వంసమైంది. అందులో కోవిడ్ రోగులు ఎవరూ లేరని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.