మహారాష్ట్రలోని పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్-పూణె హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఘటన జరిగిన సమయంలో కుటుంబసభ్యులు కారులో పూణె వైపు వెళుతున్నారు.
మహారాష్ట్రలోని పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక్కే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అహ్మద్‌నగర్-పుణె హైవేపై మంగళవారం మధ్యాహ్నం కంటైనర్ ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలిక సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను సుదం భోంధావే (66), సింధుబాయి (60), కార్తికి అశ్విన్ భోంధావే (30), ఆనంది అశ్విన్ భోంధావే (02)గా గుర్తించారు. వీరంతా బీడ్‌లోని పటోడా తహసీల్‌లోని దోమరి నివాసితులు.
కుటుంబ సమేతంగా పూణె వైపు వెళ్తున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. పూణె జిల్లాలోని కరాగావ్ సమీపంలో ఓ కంటైనర్ ట్రక్కు నిర్లక్ష్యంగా ఆగి ఉంది. ఆపై ఓ కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
తదుపరి విచారణ జరుపుతున్నట్లు షిరూర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. సుదాం భోంధవే బీడ్ జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలను నడిపేవారు. కుటుంబ సభ్యుడు కారు నడుపుతున్నాడు. ప్రమాదంలో అతనికి కూడా గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇమాలియా సుల్తాన్‌పూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం బైక్‌ను కారు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులను బబ్బు (35), రాజేశ్వరి (32), సోనాశ్రీ (60)గా గుర్తించారు. బాధితులు సీతాపూర్ జిల్లా దుర్గాపూర్ గ్రామ సమీపంలోని ఇమాలియా సుల్తాన్‌పూర్ ప్రాంతంలో ఒక శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు సీతాపూర్‌కు వెళుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.."గాయపడిన వారిని వెంటనే CHC మహోలి మరియు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు" అని పోలీసులు తెలిపారు. కారు యజమానిని అదుపులోకి తీసుకున్నామని, మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు. తదుపరి విచారణలు జరుగుతుందని పోలీసులు తెలిపారు.
