కోయంబత్తూరులో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన నలుగురు వలస కూలీలు మంగళవారం గోడ కూలిన ఘటనలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఓ ప్రైవేట్ కళాశాల ఆవరణలోని కాంపౌండ్‌ వాల్‌ కూలడంతో కార్మికులు మృతి చెందారు. 

నిర్మాణ పనుల్లో నిమగ్నమైన నలుగురు వలస కూలీలపై ఇంటి గోడకూలిన ఘటన.. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాల ఆవరణలోని కాంపౌండ్‌ వాల్‌ ఒక్కసారిగా కూలిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులపై శిథిలాలు పడిపోయాయి. గోడ కూలడంతో కార్మికులు మృతి చెందారు. ఒక కార్మికుడు పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడని, మరో ముగ్గురు కూడా వలస కూలీలేనని, విచారణ కొనసాగుతోందని ఇక్కడి సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉన్న గోడకు దగ్గరగా తాజాగా కాంపౌండ్‌ వాల్‌ నిర్మిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ప్రస్తుతం పలువురికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారిని రక్షించేందుకు వైద్యులు శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ నలుగురు వలస కూలీలు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. గోడమొత్తం ఒక్కసారిగా మీదపడటంతో.. వారికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇంతటి ప్రమాదం జరిగింది. కార్మికుల పాలిట శాపంగా మారింది. మరిన్ని విషయాలు తెలియాల్సిఉంది.