Jakhoda village: హర్యానాలో సెప్టిక్ ట్యాంక్ లో విషవాయువు పీల్చి నలుగురు కార్మికులు మృతి చెందారు. జఖోడా గ్రామంలో సెప్టిక్ ట్యాక్ కు సంబందించిన పనులు చేస్తున్న కార్మికులు ట్యాంకుకు మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
4 Dead-Poisonous Gas In Haryana Septic Tank: సెప్టిక్ ట్యాంకు సంబంధిత పనులు చేస్తుండగా విషవాయులు వెలువడి నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికులు కూడా ఉన్నారు. ఈ విషాదకర ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హర్యానాలోని ఝజ్జర్ జిల్లా బహదూర్ గఢ్ లో సెప్టిక్ ట్యాంక్ లో పైపులు వేస్తూ విషవాయువు పీల్చి ఇద్దరు వలస కూలీలు సహా నలుగురు కార్మికులు మృతి చెందారు. జఖోడా గ్రామంలో మేస్త్రీ, కొందరు కూలీలు ట్యాంకుకు మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
"తాపీ మేస్త్రీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరో వ్యక్తి లోపలికి వెళ్లి పరిశీలించినా బయటకు రాలేదు. సహాయం చేయడానికి ప్రయత్నించిన యూపీకి చెందిన ఒకరు, మధ్యప్రదేశ్ కు చెందిన మరొకరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు" అని బహదూర్గఢ్ లోని అసోడా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జస్వీర్ తెలిపారు. విషవాయువు పీల్చి ఊపిరాడక నలుగురూ మృతి చెందారని పేర్కొన్నారు.
