మహారాష్ట్రలో సోమవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.
ముంబై: మహారాష్ట్రలో సోమవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్-కజ్రత్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంబవించింది.
ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఆటోలో సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి నలుగురు సజీవ దహనమయ్యారని స్థానికులు చెప్పారు.ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
