ఓ ప్రొఫెసర్‌ను ప్లాన్ ప్రకారం స్పృహ తప్పి పడిపోయేలా చేసి.. ఆ తర్వాత దుస్తులు విప్పి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. 

ఓ ప్రొఫెసర్‌ను ప్లాన్ ప్రకారం స్పృహ తప్పి పడిపోయేలా చేసి.. ఆ తర్వాత దుస్తులు విప్పి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన తమిళనాడులోచోటుచేసుకుంది. వివరాలు.. బాధిత వ్యక్తి చెన్నైలోని అయనవరం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడు నగరంలోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అయితే అతనికి కామన్ ఫ్రెండ్ ద్వారా కొడుంగయ్యూర్‌కు చెందిన 40 ఏళ్ల రాధతో పరిచయం ఏర్పడింది. 

ఆ తర్వాత వ్యక్తిగత అవసరాలు, వ్యాపారం పేరుతో రాధ.. రెండు విడతలుగా ప్రొఫెసర్‌ నుంచి రూ. 4.5 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. 2019లో డబ్బులు చెల్లించనని చెప్పినప్పుడు.. ప్రొఫెసర్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే ఇటీవల కోర్టు రాధపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే రాధ.. ప్రొఫెసర్‌‌ డబ్బు చెల్లించకుండా బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ వేసింది. అప్పు తీరుస్తానని ప్రొఫెసర్‌తో చెప్పి.. తన స్నేహితురాలు పుష్ప ఇంటికి రావాల్సిందిగా కోరింది. 

దీంతో ప్రొఫెసర్ ఏప్రిల్ 19వ తేదీన రాధ చెప్పినట్టుగా పుష్ప ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ప్రొఫెసర్‌కు స్వాగతం పలికిన రాధ.. అతనికి మత్తమందు కలిపిన పానీయం అందజేసింది. దీంతో అది తాగి ప్రొఫెసర్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో రాధ ముందుగా వేసుకున్న ప్లాన్‌ను అమలు చేసింది. అప్పటికే అక్కడికి చేరుకున్న విల్లుపురంకు చెందిన లక్ష్మిని ప్రొఫెసర్ పక్కన పడుకోబెట్టి.. దుస్తులు విప్పి ఇద్దరి ఫొటోలు, వీడియోలు తీశారు. ఇందుకు లక్ష్మి భర్త కూడా సహకరించాడు. 

ఆ తర్వాత ప్రొఫెసర్‌కు అతని బట్టలు వేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత.. అతడు ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రాధ.. అతనిని చిత్రీకరించిన ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. అలాగే కోర్టులో కేసు ఉపసంహరించుకోవాలని.. లేదంటే వీడియోలను ఇంటర్‌నెట్‌లో పెడతానని బెదిరించింది. దీంతో భయపడిన ప్రొఫెసర్.. పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. 

ఈ క్రమంలోనే రాధ, ఆమె స్నేహితురాలు పుష్ప, వీరికి సహకరించిన లక్ష్మి, ఆమె భర్తలను అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.