ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. గర్‌ముక్తేశ్వర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన కుటుంబం ఢిల్లీకి తిరుగు పయనమైంది. అయితే వారు ప్రయాణిస్తున్న మంగళవారం అర్దరాత్రి హాపూర్ పరిధిలో నిలిపి ఉన్న ట్రక్కును వేగంతో ఢీకొట్టింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో నలుగురు చనిపోయినట్టుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బాలికను కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు నగర సర్కిల్ అధికారి అశోక్ సిసోడియా తెలిపారు. మృతుల్లో ఇద్దరిని ఢిల్లీకి చెందిన నీతు, మోహిత్‌లుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి లక్నోలో తెలిపారు.
