భోపాల్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ కూతురు ఓ అబ్బాయితో మాట్లాడడాన్ని సహించలేక  తల్లిదండ్రులు ఆమెను చితకబాదారు.. ఈ దారుణ ఘటన అలిరాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న సౌద్వలో ఓ మైనర్‌ బాలిక తనకు పరిచయం ఉన్న అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడింది. 

ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కన్న కూతరు అనే కనికరం లేకుండా ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టారు. అంతేకాదు వీధిలోకి తీసుకొచ్చి మరీ ఆమెకు గుండు కొట్టించారు. 

ఇంకెప్పుడూ ఆ అబ్బాయితో మాట్లాడను వదిలిపెట్టండి అంటూ ఆ అమ్మాయి వేడుకున్నా వారు వినిపించుకోకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియా ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను హింసించిన వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.