జ‌మ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో (Udhampur express ) శుక్ర‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో రెండు ఏసీ కోచ్‌ల‌లో మంట‌లు అంటుకున్నాయి. క్ష‌ణాల్లోనే మ‌రో రెండు ఏసీ కోచ్‌ల‌కు కూడా మంట‌లు వ్యాపించ‌డంతో.. ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

రాజ‌స్థాన్‌లోని ధౌల్‌పూర్ (Dhaulpur ) , మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) మోరినా (Morena ) మ‌ధ్య ఈ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుందని రైల్వే వర్గాలు తెలిపాయి. హేతంపూర్‌ నుంచి ఝాన్సీ‌కి (Jhansi) రైలు వెళ్తుండ‌గా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. అయితే ఓ కోచ్‌లోని ఏసీలో మంట‌లు చెల‌రేగ‌డంతోనే ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే సకాలంలో గుర్తించి ప్రయాణీకులను దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.