Asianet News TeluguAsianet News Telugu

మూసేసిన హాస్పిటల్‌లో నాలుగు మృతదేహాలు.. సూసైడ్ నోట్లు లభ్యం

మహారాష్ట్రలో 15 ఏళ్ల క్రితం మూసేసిన ఓ హాస్పిటల్‌లో నాలుగు మృతదేహాలు లభించాయి. అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. ముంబయిలోని కాందివలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 

foud dead bodied found in mumbais abandoned hospital building
Author
Mumbai, First Published Jun 30, 2022, 4:28 PM IST

ముంబయి: మహారాష్ట్రలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వాడకంలో లేని 15 ఏళ్ల క్రితమే మూసేసిన ఓ హాస్పిటల్ బిల్డింగ్‌లో నాలుగు మృతదేహాలు లభించాయి. అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ ఘటన ముంబయిలోని కాందివలీలో చోటుచేసుకుంది.

15 ఏళ్ల క్రితమే మూసేసిన ఓ హాస్పిటల్ బిల్డింగ్‌లో ఓ కుటుంబం నివసిస్తున్నది. అయితే, అదే నివాసంలో నలుగురు విగత జీవులై కనిపించారని పోలీసులు చెప్పారు. అంతేకాదు, అక్కడే నాలుగు సూసైడ్ నోట్లు కూడా లభించాయని వివరించారు. సెకండ్ ఫ్లోర్‌లో రక్తపు మడుగులో రెండు మృతదేహాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. అనంతరం, ఫస్ట్‌ ఫ్లోర్‌లు సెర్చ్ చేపట్టినట్టు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఫ్లోర్‌లో మరో రెండు మృతదేహాలు కనిపించాయని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్‌లో రెండు మృతదేహాలు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాయని వివరించారు.

మృతులను పోలీసులు గుర్తించారు. మృతులను కిరణ్ దాల్వి, ఆమె ఇద్దరు కుమార్తెలు ముస్కాన్, భూమిలుగా గుర్తించారు. మరొకరు శివదయాల్ సేన్‌గా పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటనపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఫస్ట్ ఫ్లోర్‌లో 

Follow Us:
Download App:
  • android
  • ios