Asianet News TeluguAsianet News Telugu

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై మాజీ గవర్నర్ సంచనల వ్యాఖ్యలు.. దేశద్రోహం కేసు..

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను రక్తం పీల్చే రాక్షసుడితో పోలుస్తూ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త ఆకాష్ సక్సేనా రాంపూర్ జిల్లా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  దీంతో మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Former UP Governor Aziz Qureshi booked for comparing CM Yogi Adityanath to blood-sucking monster
Author
Hyderabad, First Published Sep 6, 2021, 9:56 AM IST

ఉత్తరప్రదేశ్ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అతని ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ పై ఉత్తర ప్రదేశ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. అజీజ్ ఖురేషీ రాంపూర్ ఎమ్మెల్యే ఖాన్ భార్య   తన్జీమ్ ఫాతిమాను కలిసేందుకు అజాంఖాన్   ఇంటికి వచ్చారు.

అక్కడ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను రక్తం పీల్చే రాక్షసుడితో పోలుస్తూ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త ఆకాష్ సక్సేనా రాంపూర్ జిల్లా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  దీంతో మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ భారత శిక్షాస్మృతి సెక్షన్ 124 ఎ (ఎడిషన్),  153ఎ (మతం, జాతి ప్రాతిపదికన గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం),  153 బి  (జాతీయ సమైక్యత కు హాని కలిగించే అంశాలు),  505 (1) (బి) (ప్రజల్లో భయం కలిగించే ఉద్దేశం) సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు పెట్టారు.

ఆజాం ఖాన్  ఇంటికి వచ్చిన మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను  రక్తం పీల్చే రాక్షసుడితో పోల్చారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు.  సక్సేనా తన ఫిర్యాదులో ‘ఖురేషీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తుందని, మతపరమైన అల్లర్లకు కూడా దారితీస్తుంది అని పేర్కొన్నారు. మాజీ గవర్నర్ అజీజ్ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ముందస్తు ప్రణాళిక అని అజీజ్ గతంలో ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios