Asianet News TeluguAsianet News Telugu

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి.. వాహనాలను ధ్వంసం, దహనం

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ పూర్వీకుల ఇంటిపై మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఉదయ్‌పూర్‌లోని జామ్‌జూరి ప్రాంతంలోని రాజ్‌నగర్‌లోని దేబ్ ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పంటించారు. బయట పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. దేబ్ తండ్రి వార్షిక శ్రాద్ వేడుకలో ముందు ఈ దాడి జరగడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది.

Former Tripura CM Biplab Deb's ancestral home set on fire
Author
First Published Jan 4, 2023, 4:11 AM IST

త్రిపుర మాజీ సీఎం, బీజేపీ నేత బిప్లబ్ దేబ్ పూర్వీకుల ఇంటిపై మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. త్రిపురలోని ఉదయ్‌పూర్‌లోని జామ్‌జూరిలో ఉన్న అతని పూర్వీకుల ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పంటించారు. బయట పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పంటించే ముందు.. దుండగులు మొత్తం ఇంటిని ధ్వంసం చేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

అందిన సమాచారం ప్రకారం.. ఈ సంఘటన జరిగినప్పుడూ బిప్లబ్ దేబ్ పూర్వీకుల ఇంట్లో లోపల ఎవరూ లేరు. అందుకే ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. దుండగులు బిప్లబ్ దేబ్ ఇంటితో పాటు పక్కనే ఉన్న ఇతర వాహనాలు, బీజేపీ జెండాలను తగులబెట్టారు. సీపీఎం మద్దతుదారులే ఈ హింసాత్మక ఘటనకు పాల్పడ్డారని బీజేపీతో సంబంధమున్న నేతలు పేర్కొంటున్నారు.

సమాచారం ప్రకారం..  బుధవారం నాడు బిప్లబ్ తండ్రి హిరుధన్ దేబ్ స్మారకార్థం. స్మారకార్థానికి ఒకరోజు ముందు మాజీ సీఎం పూర్వీకుల ఇంటిపై దాడిని సీపీఎం కుట్రగా అభివర్ణిస్తున్నారు. దాడి చేసిన వారితో కక్రాబన్ ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి మంగళవారం సమావేశమైనట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం  ఇంటికి నిప్పు పెట్టిన ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది.

 బిప్లబ్ దేబ్ రాజకీయ ప్రయాణం

బిప్లబ్ కుమార్ దేబ్ 1969 నవంబర్ 25న త్రిపురలోని గోమతి జిల్లా రాజధర్ నగర్ గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి హరధన్ దేబ్ స్థానిక జనసంఘ్ నాయకుడు. బిప్లబ్ దేబ్ 1999లో త్రిపురలోని ఉదయపూర్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో 16 ఏళ్ల పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా పనిచేశారు. మధ్యప్రదేశ్ , సాత్నాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన దాదాపు పదేళ్లపాటు సాత్నా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నారు.

2014లో బనారస్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీ ప్రచారాన్ని నిర్వహించే పనిని కూడా బిప్లబ్ దేబ్ చేశారు. 2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ బిప్లబ్ దేబ్‌ను ఢిల్లీ నుంచి త్రిపురకు పంపించారు. త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రెండు సంవత్సరాలలో బిప్లబ్ దేవ్ ఆ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. దీంతో  గత 25 యేండ్ల వామపక్ష సామ్రాజ్యం అంతమైంది. ఈ అద్భుతమైన విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించిన బిప్లబ్ దేబ్‌కు బీజేపీ బహుమతి ఇచ్చింది.2018లో ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios