Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే మేనల్లుడి తలతెస్తే.. రూ.50లక్షల రివార్డ్

కాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు సహజమని నవీన్‌ తండ్రి పవన్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు, శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయన్నారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు  కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్‌ భర్త సహా 60 మందిని అరెస్టు చేశారు.

Former SP Leader Announces reward Rs 50 lakh on Karnataka congress MLA nephew naveen head
Author
Hyderabad, First Published Aug 15, 2020, 11:54 AM IST


కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో ఇటీవల అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ సోషల్ మీడియాలో  చేసిన ఓ ట్వీట్ కారణంగానే ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. అయితే.. ఈ క్రమంలో... ఆయన తల తెచ్చిన వారికి రూ.50 లక్షల  రివార్డు ఇస్తామంటూ మీరట్‌కు చెందిన షహజీబ్‌ రిజ్వి అనే వ్యక్తి శుక్రవారం ట్వీట్‌ చేశారు. 

కాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు సహజమని నవీన్‌ తండ్రి పవన్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు, శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయన్నారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు  కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్‌ భర్త సహా 60 మందిని అరెస్టు చేశారు.

కాగా.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి నివాసం పై కొందరు పౌరులు దాడికి పాల్పడ్డారు. వెంటనే ఎమ్మెల్యే  ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో వారు అక్కడికి పరుగున వచ్చారు. అయితే.. వారు పోలీసుల పై రాళ్ల దాడి చేయడం గమనార్హం.

వాహ‌నాన్ని త‌గులబెట్టారు. ఈ నేప‌ధ్యంలో ప‌రిస్థితుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు  జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి నివాసంతో పాటు బెంగళూరు తూర్పులోని కెజె హాలీ పోలీస్ స్టేషన్‌పై కూడా ఈ అల్ల‌రిమూక దాడి చేసింది. ఎమ్మెల్యే మేనల్లుడు సోష‌ల్ మీడియాలో చేసిన ఒక పోస్టును వ్య‌తిరేకిస్తూ, వీరు దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. 

ఆందోళ‌న‌ల‌ను అదుపు చేసేందుకు పోలీసులు జ‌రిపిన కాల్ప‌ల్లో ఇద్ద‌రు మృతి చెందారు. కాగా ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మయి ఆదేశాలు జారీ చేశారు. దాడికి పాల్ప‌డిన‌వారిపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios