RBI: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ కన్నుమూత.. 1990ల సంక్షోభ, సంస్కరణల సమయంలో బాధ్యతలు

ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ ఈ రోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. 1990 నుంచి 1992 వరకు దేశ ఆర్థిక చరిత్రలో కీలకమైన ఘట్టంలో ఆయన ఆర్బీఐకి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

former RBI governor S venkitaramanan passed away in tamilnadu today morning kms

హైదరాబాద్: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్(92) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంత అనారోగ్యానికి గురైన ఆయన ఈ రోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరూ కుమార్తెలు గిరిజ, సుధా. 1990లనాటి సంక్షోభ, సంస్కరణల కాలంలో ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశాన్ని కుదిపేసిన హర్షద్ మెహెతా స్కామ్ జరిగిన కాలం కూడా అదే.

ఎస్ వెంకటరమణన్‌ను 18వ ఆర్బీఐ గవర్నర్‌గా చంద్రశేఖర్ ప్రభుత్వం నియమించింది. విదేశీ మారక నిల్వలు కరిగిపోయిన సందర్భంలో ఒక ఎకనామిస్ట్‌గా ఫార్మల్ క్వాలిఫికేషన్స్ లేకున్నా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యుయేషన్ పై ఉన్న అవగాహనతో ఎస్ వెంకటరమణన్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ గవర్నర్ పదవికి ముందు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా 1985 నుంచి 1989 వరకు బాధ్యతలు చేపట్టారు.

ఆర్బీఐ గవర్నర్‌గా ఎస్ వెంకటరమణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షోభ నివారణంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ సారథ్యంలో కీలకమైన సంస్కరణల్లోనూ పాలుపంచుకున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి స్థిరీకరణ కార్యక్రమంలో భాగంగా రూపాయి విలువను తగ్గించడంలోనూ ఈయన పాత్రపోషించారు. దేశాన్ని కుదిపేసిన హర్షద్ మెహెతా స్కామ్ కూడా ఇదే కాలంలో జరిగింది. ఇది వ్యవస్థ లోపం అని విమర్శలు వచ్చాయి. ఆ స్కామ్ తర్వాతే గవర్నమెంట్ సెక్యూరిటీల మార్కెట్‌లోనూ కీలక సంస్కరణలు అమలయ్యాయి.

Also Read: World Cup: వరల్డ్ కప్‌లో‌ ఇండియా గెలిస్తే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరుగుతీస్తా.. ఈ తెలుగు నటి కామెంట్

ట్రావెన్‌కోర్ సంస్థానంలోని నాగర్‌కోయిల్‌లో జన్మించిన ఎస్ వెంకటరమణన్ తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత యూఎస్ఏలోని కార్నేజీ మెల్లాన్ యూనివర్సిటీ, పిట్స్‌బర్గ్‌ నుంచి ఇంస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ పై మాస్టర్స్ పట్టా పొందారు. ఆ తర్వాత ఐఏఎస్ హోదాలో ఎస్ వెంకటరమణన్ అనేక కీలక బాధ్యతలు చేపట్టారు.

రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఎస్ వెంకటరమణన్ అశోక్ లేలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్‌లో చైర్మన్‌గా చేశారు. న్యూ త్రిపుర ఏరియా డెవలప్‌మెంట్ కార్పొరేషన్, అశోక్ లేలాండ్ ఫైనాన్స్‌లకూ సేవలు అందించారు. వీటికితోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులోనూ, ఎస్ఫీఐసీ, పిరమల్ హెల్త్ కేర్, తమిళనాడు వాటర్ ఇన్వెస్ట్‌మెంట్ కో, హెచ్‌డీఎఫ్‌సీల్లోనూ ఆయన పని చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios