New Delhi: సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా సహా పలు రాష్ట్రాల‌ను క‌వ‌ర్ చేస్తూ జ‌మ్మూకాశ్మీర్ లో ముగియ‌నుంది. ప్ర‌స్తుతం భార‌త్ జోడో యాత్ర మంగ‌ళ‌వారం నాడు దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ప్రారంభమై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోకి ప్ర‌వేశించింది. 

Bharat Jodo Yatra: తొమ్మిది రోజుల విరామం తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్రస మంగ‌ళ‌వారం తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్ర ఇప్పటివరకు 110 రోజులకు పైగా మరియు 3,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భార‌త్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ఇది చివ‌ర‌కు జమ్మూ కాశ్మీర్ లో ముగుస్తుంది. భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు కాలినడకన చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఇదేనని కాంగ్రెస్ పేర్కొంది. జనవరి 26 న శ్రీనగర్ లో భార‌త్ జోడో యాత్ర ముగిసిన త‌ర్వాత‌.. యాత్ర సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ 'హాత్ సే హాత్ జోడో' ప్రచారాన్ని ప్రారంభిస్తుంది.

రాహుల్ గాంధీతో కలిసి న‌డిచిన‌ రా మాజీ చీఫ్ ఎఎస్ దులత్

క్రిస్మ‌స్, కొత్త సంవ‌త్స‌రం నేప‌థ్యంలో తొమ్మిది రోజుల విరామం త‌ర్వాత భార‌త్ జోడో యాత్ర తిరిగి నేడు ప్రారంమైంది. ప్ర‌స్తుతం భార‌త్ జోడో యాత్ర మంగ‌ళ‌వారం నాడు దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ప్రారంభమై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోకి ప్ర‌వేశించింది. అయితే, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి రా మాజీ చీఫ్ ఎఎస్ దులత్ ముందుకు న‌డిచారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దులత్ ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన చిత్రాల‌ను కాంగ్రెస్ ట్విట్ట‌ర్ లో పంచుకుంది. 1999 నుంచి 2000 వరకు దులత్ ఆర్ అండ్ ఏడబ్ల్యూకు నేతృత్వం వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) ప్రత్యేక డైరెక్టర్ గా కూడా పనిచేసిన ఆయన ఇటీవలి సంవత్సరాలలో వివిధ పుస్తకాలను రాశారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

కాగా, అంత‌కుముందు (2022) డిసెంబర్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. అలాగే, నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ డిసెంబర్ 24 న ఢిల్లీలో జరిగిన మార్చ్ లో పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌లో బాలీవుడ్ నటులు పూజా భట్, స్వర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

కాగా, జనవరి 26 న శ్రీనగర్ లో భార‌త్ జోడో యాత్ర ముగిసిన త‌ర్వాత‌.. యాత్ర సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ 'హాత్ సే హాత్ జోడో' ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. మహిళల మీద ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా 'హాత్ సే హాత్ జోడో' ప్రచారాన్ని నడిపించే బాధ్యతను ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.