అకాలీదళ్‌కు తీరని లోటు.. సీనియర్ నేత రంజిత్ సింగ్ బ్రహ్మపుర కన్నుమూత..
శిరోమణి అకాలీదళ్ (SAD) నాయకుడు రంజిత్ సింగ్ బ్రహ్మపుర (85) దీర్ఘకాలంగా అనారోగ్యంతో మంగళవారం చండీగఢ్‌లో మరణించారు. అతను ఖాదూర్ సాహిబ్ నుండి మాజీ ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యే.
శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ మంత్రి రంజిత్ సింగ్ బ్రహ్మపుర (85) మంగళవారం కన్నుమూశారు.ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతని పరిస్థితి క్షీణించడంతో గత కొన్ని రోజులుగా చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER)లో చిక్సిత పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మాజీ ఎంపీ బ్రహ్మపుర మంగళవారం కన్నుమూశారని అకాలీ నేత దల్జీత్ సింగ్ చీమా తెలిపారు.
బ్రహ్మపుర అంత్యక్రియలు బుధవారం తర్న్ తరన్‌లోని అతని స్వగ్రామమైన బ్రహ్మపురలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అకాలీదళ్ అధినేత బాదల్, కేంద్ర మాజీ మంత్రులు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, బిక్రమ్ సింగ్ మజిథియా సహా పలువురు సీనియర్ నేతలు బ్రహ్మపుర మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.'మఝే దా జర్నైల్' (జనరల్ ఆఫ్ మాఝా) అని పిలుచుకునే బ్రహ్మపుర నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుండి 2019 వరకు ఖాదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
అకాలీదళ్‌కు తీరని లోటు-సుఖ్‌బీర్ సింగ్ బాదల్
అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేస్తూ.."యోధుడు , అకాలీదళ్ జతేదార్ రంజిత్ సింగ్ జీ బ్రహ్మపుర మరణం పంజాబ్ ,శిరోమణి అకాలీదళ్‌కు తీరని లోటు. ఈ ఎదురుదెబ్బ భర్తీ చేయడం కష్టతరం. సాహిబ్ తన జీవితాంతం రాజకీయాల్లో మతపరమైన విలువలకు దృఢమైన ప్రతీకగా నిలిచాడు. సిక్కులను ముందుండి నడిపించాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని మరియు కుటుంబానికి ఆ నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను." అని పేర్కొన్నారు.
అకాలీదళ్ నాయకురాలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సంతాపం తెలుపుతూ.. "అకాలీదళ్ పోషకుడు జతేదార్ రంజిత్ సింగ్ జీ బ్రహ్మపురా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అకాలీ నాయకుడైన అకాలీ వర్గానికి, పార్టీకి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
రంజిత్ సింగ్ బ్రహ్మపుర రాజకీయ ప్రస్తానం
రంజిత్ సింగ్ బ్రహ్మపుర తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక గెలుపు, ఓటములను చవిచూశారు. అనేక పదవులను అలంకరించారు. ఆయన 2014-19 వరకు లోక్‌సభలో ఖాదూర్ సాహిబ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. గత నెలలో పార్టీ పోషకుడిగా నియమించబడ్డాడు. ఆయన ప్రకాష్ సింగ్ బాదల్‌తో సన్నిహితంగా పనిచేశాడు. రెండుసార్లు పంజాబ్ క్యాబినెట్ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి , పంచాయితీ , సహకార శాఖలకు నాయకత్వం వహించాడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.