కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్ 89 ఏళ్ల వయస్సుల్లో గుండెపోటుతో మరణించారు. ఆయన అమరావతికి మొదటి మేయర్ గా పని చేశారు. షెకావత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. 

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్ (89) శుక్రవారం గుండెపోటుతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. కొంత కాలం కిందట ఆయనకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 9 గంటలకు కన్నుమూశారు. దేవిసింగ్ షెకావత్ కు భార్య ప్రతిభా పాటిల్, ఇద్దరు పిల్లలు (ఒక కుమారుడు, ఒక కుమార్తె) ఉన్నారు. ఆయన అంత్యక్రియలు పుణెలో జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి.

మణిపాల్ యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. 42 మంది విద్యార్ధులపై సస్పెన్షన్ వేటు

షెకావత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘ నా ఆలోచనలు మన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జీ, ఆమె కుటుంబ సభ్యులతో ఉన్నాయి. డాక్టర్ దేవిసింగ్ షెకావత్ జీ మరణించారు. ఆయన వివిధ సమాజ సేవా కార్యక్రమాల ద్వారా సమాజంపై తనదైన ముద్ర వేశారు. ఓం శాంతి’’ అని ఆయన ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా షెకావత్ మృతికి సంతాపం తెలిపారు. ‘‘ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ప్రఖ్యాత వ్యవసాయవేత్త దేవిసింగ్‌ రాంసింగ్‌ షెకావత్‌ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అనుభవజ్ఞుడైన నాయకుడు అమరావతికి మొదటి మేయర్‌గా పనిచేశారు. భారతదేశపు మొదటి మహిళా న్యాయమూర్తి ప్రతిభా తాయ్‌కు బలమైన మద్దతు అందించారు’’ అని పవార్ ట్వీట్ చేశారు. 
 అని పవార్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

ఆయన మరణం పట్ల మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా స్పందించారు. ‘‘ డాక్టర్ దేవిసింగ్ షెకావత్ మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ దుఃఖ సమయంలో శ్రీమతి ప్రతిభా సింగ్ పాటిల్ జీ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…